పుట:Hello Doctor Final Book.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రోగిని పరీక్షించుటవలన, రక్తపరీక్షలు, శ్రవణాతీతధ్వని పరీక్షల (ultrasonography & Doppler studies) వలన వైద్యులు సరియైన వ్యాధినిర్ణయము చేయగలుగుతారు.

ఊపిరితిత్తుల తాపము (pneumonia), హృద్ధమనీ వ్యాధులు (Coronary artery diseases), బృహద్ధమని విదళనము (dissecting aortic aneurysm), పుపుసవేష్టన వ్యాధులు (pleural diseases), హృత్కోశతాపము (pericarditis), ప్రక్కటెముకల విఱుగుళ్ళు (rib fractures), పక్కటెముకల మృదులాస్థులలో తాపములు (costochondrtis) ఛాతినొప్పి, ఆయాసములను కలిగించి పుపుసధమనులలో రక్తప్రసరణ అవరోధకములను (pulmonary arterial embolism) పోలి ఉండవచ్చును. పరీక్షలు : డి- డై మర్ పరీక్ష ( D- dimer ) :

శరీరములో రక్తపుగడ్డలను  ప్లాస్మిన్ (Plasmin) విచ్ఛేదిస్తుంది. తాంతవ (fibrin) విచ్ఛేదనము వలన వచ్చే డి డైమర్ ల (D-dimer) విలువలు నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉన్నవారిలోను, పుపుస ధమనులలో రక్తపుగడ్డలు చేరినవారిలోను హెచ్చుగా (500 మైక్రోగ్రాములు / లీటరునకు మించి ) ఉంటాయి.

మిగిలిన రోగలక్షణములు లేక, శరీరనిశ్చలత (Immobility), సమీపకాలములో రక్తపుగడల ్డ అవకాశములు పెంచే శస్త్రచికిత్సలు, క్షతములు వంటి కారణములు లేనివారిలో డి - డైమరు విలువలు  తక్కువగా ఉంటే వారి నిమ్నసిరలలో రక్తపుగడ్డలు ఉండే అవకాశములు చాలా తక్కువ. శ్రవణాతీతధ్వని పరీక్షలు ( Ultrasonography, Doppler studies) :

శ్రవణాతీతధ్వనితరంగ పరీక్షలతో సిరలను చిత్రీకరించినపుడు సిరలలో రక్తపుగడ్డలు కనిపించవచ్చును. రక్తపుగడలు ్డ లేని సిరలు ఒత్తిడికి అణుగుతాయి (compressible). రక్తపుగడ్డలు ఉన్న సిరలు ఒత్తిడికి అణగవు (non compressible). డాప్లర్ పరీక్షతో రక్తగమనమును చిత్రీకరించవచ్చును.

153 ::