పుట:Hello Doctor Final Book.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తము గడ్డకట్టే ప్రక్రియలో లోపములు ఉంటే రక్కస్రావము అధికము కావచ్చును, లేక రక్తపుగడ్డలు ఏర్పడి రక్తప్రసరణకు అవరోధము కలిగించ వచ్చును. రక్తపుగడ్డలు సిరలలో (veins) గాని, ధమనులలో (arteries) గాని, హృదయములో గాని ఏర్పడవచ్చును. ఈ గడ్డలు రక్తప్రవాహములో కొట్టుకుపోయి దూరముగా రక్తప్రసరణకు అవరోధకములుగా (emboli) అంతరాయము కలిగించవచ్చును. కాళ్ళ సిరలు ( Veins of lower extremity ) :

సిరలు రక్తమును హృదయమునకు కొనిపోతాయి. చర్మమునకు దిగువ, కండర ఆచ్ఛాదనమునకు (కండరములను ఆవరించి ఉండే గట్టి పొర deep fascia) పైన ఉండు సిరలు బాహ్యసిరలు (Superficial veins).

కండర ఆచ్ఛాదనమునకు లోపల ఉండు సిరలు నిమ్నసిరలు (deep veins). కాళ్ళలో బాహ్యసిరలు పాదముల నుంచి బయలుదేరుతాయి.

147 ::