పుట:Hello Doctor Final Book.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13. నిమ్నసిర రక ్తఘనీభవనము (Deep Vein Thrombosis) పుపుసధమనిలో అవరోధకములు ( Pulmonary Embolism ) రక ్తఘనీభవనము ( Coagulation of blood ) :

శరీరమునకు గాయములు కలిగినపుడు రక్తస్రావమును నిలిపి అదుపు చేయుటకు రక్తము గడ్డకడుతుంది. రక్తస్రావ నిరోధము (hemostasis) రెండు దశలలో జరుగుతుంది. ప్రాథమిక రక్తస్ర థి త్వ దశలో (Primary hemostasis) రక్తఫలకములు ( platelets ), వాన్ విల్లీబ్రాండ్ (Von Willebrand factor) అంశముతో కూడి గాయమునకు అంటుకొని బిరడా వలె రక్తస్రావమును అరికడుతాయి. అదేసమయములో ద్వితీయ రక్తస్థిరత్వ దశ (secondary hemostasis) కూడా మొదలవుతుంది. ఈ దశలో రక్తనాళపు లోపొర (intima) ఛిద్రమగుట వలన లోపొర క్రిందనున్న కణజాలము నుండి కణజాల అంశము (tissue factor) విడుదలై వివిధ రక్తఘనీభవన అంశముల (clotting factors) ప్రేరేపణను ఆరంభిస్తుంది. చివరకు రక్తములోని తాంతవజని (fibrinogen) తాంతవము (fibrin) అనే పోగులుగా మారి కణములను సంధించుకొని గుజ్జుగా రక్తమును ఘనీభవింపజేస్తుంది. రక్తపుగడ్డలు గాయమునకు అంటుకొని రక్తస్రావమును అరికడుతాయి. ఈ ప్రక్రియలో ప్రోథ్రాంబిన్ అనే రక్త ఘనీభవన అంశము  (prothrombin - factor 2) > థ్రాంబిన్ గా (thrombin) మారుతుంది. ఆపై థ్రాంబిన్ (thrombin) వలన తాంతవజని (fibrinogen) > తాంతవముగా (fibrin) మారుతుంది.

146 ::