పుట:Hello Doctor Final Book.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సవిరామ వాయుపీడన సాధనములు ( intermittent pneumatic compression devices ) : సిరలలో రక్తప్రసరణను మెరుగుపఱచుటకు ఉపయోగపడుతాయి. కాళ్ళ పొంగులను, వాపులను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణములు మానుటకు తోడ్పడుతాయి. ఉబ్బుసిరల విధ్వంసము :

ఉబ్బుసిరలలో తంతీకరణ రసాయనములతో (sclerosing agents) తాపప్రక్రియ (inflammation) కలుగజేసి వాటిని ధ్వంసము చేసి పీచు కణజాలముచే గట్టిపఱచ (sclerosis) వచ్చును.

శీతల శలాకలతోను (cryoprobes), ఉష్ణ శలాకలతోను, విద్యుచ్ఛక్తి శలాకలతోను సిరాంతర విధ్వంస (Endovenous ablation) ప్రక్రియచే ఉబ్బుసిరలను ధ్వంసము చేయవచ్చును. ఉబ్బుసిరలను లేసర్ కాంతికిరణ ప్రసరణముతోను, ఆవిరిని ప్రసరింపజేసి కూడా ధ్వంసము చేయవచ్చును. శ్రవణాతీతధ్వని సాధనములు శలాకలను సిరలలోనికి చేర్చుటకు ఉపయోగపడుతాయి. ధ్వంసమయిన సిరలు పీచు కణజాలముతో గట్టిపడుతాయి

145 ::