పుట:Hello Doctor Final Book.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాహ్యసిరల లోనికి ప్రవాహము ఎచ్చట తిరోగమనము చెందుతున్నదో నిర్ణయించవచ్చును.

ఇదివరలో ఊర్ధ్వపాద సిరచాపములోనికి (dorsal venous arch) సూది ద్వారా వ్యత్యాస పదార్థములను (contrast materials) ఎక్కించి ఎక్స్ - రే లతో సిరలను చిత్రీకరించేవారు.

ఈ దినములలో శ్రవణాతీతధ్వని సాధనములతో (ultrasonic equipment) కాళ్ళలోని దృశ్యసిరలను (saphenous veins), నిమ్నసిరలను (deep veins) చిత్రీకరించవచ్చును. రక్తప్రవాహము తిరోగమనము చెందు స్థానములను కూడా నిర్ణయించవచ్చును. చికిత్సలు : కాళ్ళు ఎత్తు లో పెట్టు ట :

కాళ్ళు హృదయము కంటె ఎత్తుగా ఉంచుట వలన సిరలలో  సాంద్రత (congestion) తగ్గుతుంది. పాదములలోను, చీలమండలలోను పొంగు, వాపు తగ్గుతాయి. తాపప్రక్రియ కూడా తగ్గుతుంది. వ్యాయామము :

నడక, వ్యాయామము సిరలలో  సాంద్రతను తగ్గిస్తాయి. కండరముల బిగుతును పెంచుతాయి. సాగు మేజోళ్ళు ( elastic stockings ) :

తగిన పీడనము గల మేజోళ్ళు మొలవఱకు గాని మోకాళ్ళ వఱకు గాని ధరిస్తే అవి సిరలలో రక్తప్రవాహమునకు తోడ్పడుతాయి. సిరలలో సాంద్రతను తగ్గిస్తాయి. కాళ్ళు, చీలమండలము (ankle), పాదాలలో పొంగును, వాపును తగ్గిస్తాయి. కణజాలములో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మములో తాపప్రక్రియను తగ్గిస్తాయి. ఉబ్బుసిర వ్రణముల మానుదలకు తోడ్పడుతాయి. దూరధమని వ్యాధి (Peripheral Arterial Disease) గలవారు సాగు మేజోళ్ళు వాడకూడదు.

144 ::