పుట:Hello Doctor Final Book.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉబ్బుసిరల వలన కొన్ని ఉపద్రవములు (complications) కలుగవచ్చు. నిశ్చలన చర్మతాపము ( stasis dermatitis ) :

ఉబ్బుసిరలలో రక్తస్థంభపు (column of blood) పెరుగుదల వలన  కేశనాళికలలో పీడనము పెరిగి కణజాలములో ద్రవసాంద్రత (congestion) పెరుగుతుంది. ఎఱ్ఱరక్తకణములు కూడా కణజాలములో చేరి వానినుంచి వెలువడు రక్తవర్ణకము (hemoglobin) హీమోసిడరిన్ గా (hemosiderin) నిక్షిప్తమవుతుంది. చర్మమునకు అద్దే లేపనములు వికటించి తాపము కలిగించవచ్చును. ఈ కారణములు అన్నీ చర్మతాపమును కలిగించ గలవు.

చర్మతాపము కలిగిన వారికి దురద, నొప్పి కలుగుతాయి. చర్మములో వాపు, ఎఱద ్ఱ నము, గోధుమవర్ణకము కలుగుతాయి. చర్మపు మందము తగ్గుతుంది. చర్మములో పగుళ్ళు, పుళ్ళు కలుగవచ్చును. ఆపై సూక్ష్మాంగజీవుల ఆక్రమణ వలన చర్మములోను, చర్మముక్రింద కణజాలములోను తాపప్రక్రియ (inflammation) కలుగవచ్చును. నిశ్చలన చర్మతాపము ఉబ్బుసిర వ్రణములకు (varicose venous ulcers) దారితీయవచ్చును.

మానుదల లేని దీర్ఘకాలపు ఉబ్బుసిర వ్రణములలో కర్కట వ్రణములు (carcinomas,  or Sarcomas) పొడచూపవచ్చును. ఉబ్బుసిరలలో రక్తపుగడ్డలు ఏర్పడవచ్చును. అసాధారణముగా యీ రక్తపుగడ్డలు నిమ్నసిరలకు వ్యాపించవచ్చును. ఈ రక్తపుగడ్డలు కుడికర్ణిక, కుడిజఠరికల ద్వారా, పుపుసధమనికి చేరితే అపాయకరము. పరీక్షలు :

ఉబ్బుసిరలు ఉన్న వ్యక్తిని పడుకోబెట్టి ఆ కాలును ఎత్తిపెట్టి సిరలు సంకోచించాక మొలక్రింద దృశ్యసిర (saphenous vein) ఊరుసిరతో (femoral vein)  సంధానమయే చోటను, ఛిద్రసిరల స్థానముల వద్దను పట్టీలు బిగించి, వ్యక్తిని నిలుచోబెట్టి పట్టీలు ఒక్కక్కటి తీసి నిమ్నసిరలనుంచి

143 ::