పుట:Hello Doctor Final Book.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలి సిరలు ( Veins in lower extremity ) :

కాళ్ళలో బాహ్యసిరలు పాదమునుంచి బయలుదేరుతాయి. పాదము పైభాగములో కనిపించే ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot) మధ్యసము ్థ గా (medially) చీలమండ (ankle) ఎముకకు ముందుగా కాలిపైకి గరిష్ఠ దృశ్యసిరగా (great saphenous vein) ఎగబ్రాకుతుంది. తొడ లోపలి భాగములో యీ గరిష్ఠ దృశ్యసిర (great saphenous vein) పయనించి తొడ పైభాగములో దృశ్యసిర రంధ్రము (saphenous orifice) ద్వారా లోపలకు దూరి ఊరుసిరతో (femoral vein ; తొడసిర) కలుస్తుంది.

ఊర్ధ్వపాద సిరచాపము (dorsal venous arch of foot ) పార్శ్వ భాగమున చిటికెనవేలు పైభాగపు అంగుళిక సిరతో (digital vein) కలిసి కనిష్ఠ దృశ్యసిరగా (Lesser Saphenous vein) చీలమండలము పార్శ్వభాగపు ఎముకకు వెనుకగా పైకి ప్రాకి కాలు వెనుక భాగములో పయనిస్తుంది. కాలి పైభాగములో మోకాలు వెనుక ఈ సిర కండరఆచ్ఛాదనము (deep fascia) లోనికి చొచ్చి జానుసిరతో (popliteal vein) కలుస్తుంది. జానుసిర, ఊరుసిరగా (femoral vein) తొడలోపల పయనిస్తుంది.కటివలయములో (pelvis) ఊరుసిర బాహ్య శ్రోణిసిరయై (external ileac vein), అంతర శ్రోణిసిరతో (internal ileac vein) కలసి శ్రోణిసిర (common ileac vein) అవుతుంది. వామ, దక్షిణ శ్రోణిసిరల సంధానము వలన అధోబృహత్సిర (inferior venacava) ఏర్పడుతుంది.

పీడన వ్యత్యాసము వలన దూరసిరల నుంచి రక్తము ముందుకు ప్రవహించి హృదయములో కుడికర్ణికకు చేరుతుంది. కాళ్ళలో కండరములు ముకుళించుకొన్నపుడు నిమ్నసిరలపై ఒత్తిడి కలిగి రక్తము ముందుకు నెట్ట బడుతుంది. సిరలలో కవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి. కండరములు విరామస్థి తి కి చేరినపుడు నిమ్నసిరలలో పీడనము తగ్గి బాహ్యసిరలలోని రక్తము ఛిద్రసిరల ద్వారా నిమ్మసిరలలోనికి ప్రవహిస్తుంది.

141 ::