పుట:Hello Doctor Final Book.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిరల గోడలలో మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో (tunica externa)  పీచుకణజాలము (collagen), సాగుకణజాలము (elastin) ఉంటాయి. మధ్యపొరలో (tunica media) మృదు కండరములు ఉంటాయి. లోపొరలో (tunica intima) పూతకణములు మూలాధారపు పొరను (basement membrane) అంటిపెట్టుకొని ఉంటాయి. సిరల బయటపొర, మధ్య పొరల మందము ధమనుల పొరల మందము కంటె బాగా తక్కువ. గుండె ఎడమ జఠరికలో (left ventricle) రక్తపీడనము అత్యధికముగా ఉండి ధమనులు, సిరలు చివరకు కుడి కర్ణికకు (Right atrium) వచ్చేసరికి ఆ పీడనము క్రమముగా తగ్గుతుంది. ఎడమ జఠరిక ముకుళించు కున్నప్పుడు ధమనులలో పీడనము పెరిగి అలలుగా రక్తము ముందుకు ప్రవహిస్త ుం ది. పీడన వ్యత్యాసము వలన రక్త ము సిరలలోనికి ఆపై కుడి కర్ణికకు చేరుతుంది. వికసించుకున్నపుడు కుడికర్ణికలో పీడనము బాగా తగ్గుతుంది. అందువలన కుడికర్ణిక బృహత్సిరలనుంచి రక్తమును గ్రహించ గలుతుంది. ఉబ్బుసిరలు సాధారణముగా కాళ్ళలో చూస్తాము. సిరలు మూడు రకములు.

బాహ్యసిరలు (superficial veins) : చర్మముక్రింద, కండర ఆచ్ఛాదమునకు (deep fascia) పైన ఉంటాయి. నిమ్నసిరలు (deep veins) : కండర ఆచ్ఛాదమునకు (deep fascia) లోపల ఉంటాయి.

ఛిద్రసిరలు (perforator veins; సంధానసిరలు) బాహ్యసిరలను, నిమ్నసిరలతో కలుపుతాయి. ఇవి కండర ఆచ్ఛాదమును చొచ్చుకొని లోపలకు ప్రవేశిస్తాయి. సాధారణ స్థితులలో రక్తము బాహ్యసిరలనుంచి నిమ్నసిరలలోనికి ఛిద్ర సిరల ద్వారా ప్రవహిస్త ుం ది. సిరలలో ఉండే ద్విపత్రకవాటములు తిరోగమన ప్రవాహమును నిరోధిస్తాయి.

140 ::