పుట:Hello Doctor Final Book.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. ఉబ్బు సిరలు (Varicose Veins)

సిరలు ( Veins )

హృదయము నుంచి రక్తము వివిధ అవయవాల కణజాలమునకు ధమనుల ద్వారా అందించబడుతుంది. ధమనులు సూక్ష్మ ధమనులుగా శాఖలు చెంది కణజాలములో  రక్తకేశనాళికలుగా (capillaries) చీలికలవుతాయి. కేశనాళికలలోని రక్తము నుంచి ప్రాణవాయువు, పోషక పదార్థములు కణజాలమునకు చేరి, కణజాలము నుంచి బొగ్గుపులుసు వాయువు, వ్యర్థ పదార్థములు రక్తములోనికి ప్రవేశిస్తాయి. సూక్ష్మ రక్తనాళికలు కలయికచే సిరలు ఏర్పడుతాయి. సిరల పాయలు కలిసి పెద్ద సిరలు ఏర్పడి తుదకు ఊర్ధ్వబృహత్సిర (superior venacava), అధోబృహత్సిరల (inferior venacava) ద్వారా రక్తమును హృదయపు కుడి కర్ణికకు తిరిగి చేరుస్తాయి.

139 ::