పుట:Hello Doctor Final Book.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక ్తపుగడ్డ ల తొలగింపు ( Embolectomy ); రక ్తపుగడ్డ ల విచ్ఛేదన (Thrombolytic therapy ):

ధమనులలో రక్తపు గడ్డలు ఏర్పడినా (thrombosis), ప్రవాహములో వచ్చి పేరుకొనినా (emboli) వాటిని శస్త్రచికిత్సతో కృత్రిమ నాళికపు బుడగలను ఉపయోగించి తొలగిస్తారు. అలా తొలగించ లేనపుడు రక్తపు గడల ్డ విచ్ఛేదకములను (tissue plasminogen activator- tPA / thrombolytic agents) వాడి వాటిని కరిగింపజేస్తారు. అంగవిచ్ఛేదనము ( amputation ):

రక్తప్రసరణ కోల్పోయి కణజాలము మరణించినపుడు  (gangrene formation), పుళ్ళుపడి సూక్ష్మజీవుల ఆక్రమణ అధ్వాన్నమయినపుడు, రక్తప్రసరణ పునరుద్ధరణ సాధ్యము కానప్పుడు బాధ ఉపశమునకు, ప్రాణరక్షణకు అంగవిచ్ఛేదన (amputation) అవసరము. రక్తప్రసరణకు అవరోధము ఎచట ఉన్నదో దానిని బట్టి ఎచ్చట విచ్ఛేదనము చెయ్యాలో వైద్యులు నిర్ణయిస్తారు. దూరధమని వ్యాధిగ్రస్థులలో హృద్ధమని వ్యాధులు, గుండెపోటులు, మస్తిష్క విఘాతములు వలన మృత్యువు కలిగే అవకాశములు, అంగనష్టము కలిగే అవకాశము కంటె హెచ్చు.

138 ::