పుట:Hello Doctor Final Book.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హృదయవైఫల్యపు లక్షణములు అధికము కావచ్చును. దీనివలన కళ్ళు తిరుగుట, కడుపు పీకు, వంటి విలక్షణములు కలుగవచ్చును పెంటాక్సిఫిలిన్ (Pentoxifylline) చాలా సంవత్సరములు వాడుకలో ఉన్నా దీనివలన ప్రయోజనము అనుమానాస్పదమే. విటమిన్ బి -12, ఫోలిక్ ఏసిడ్ ల వలన ప్రయోజనము కలుగదు.

ధమనీ పునరుద్ధ రణ చికిత్సలు (Revascularization procedures) :

దూర ధమనులలో వ్యాధి తీవ్రత హెచ్చయినప్పుడు, విరామ సమయములలో నొప్పి కలుగునపుడు ధమనీ పునరుద్ధరణ (revascularization) అవసరము.

కృత్రిమ నాళికపు బుడగతో ధమనిలో సంకుచించిన భాగమును వ్యాకోచింపజేయవచ్చును (balloon angioplasty). శ్రోణిధమని (ileac artery), ఊరుధమనులలో (femoral artery) వ్యాధి ఉంటే యీ ప్రక్రియ వలన ప్రయోజనము కలుగవచ్చును. క్రింద ధమనుల వ్యాధిగ్రస్థులలో ఫలితములు తక్కువ. ధమనిని వ్యాకోచింపజేసిన (angioplasty) పిమ్మట వ్యాకోచ నాళికలు (stents) పొందుపఱచుట వలన ఫలితములు మెరుగుగా లేవు. ధమనీ కాఠిన్య ఫలకల తొలగింపు (atherectomy) వలన, ధమనిని వ్యాకోచింపజేయుటకంటె దీర్ఘకాలిక ఫలితములు మెరుగుగా లేవు. అధిగమన శస్త్రచికిత్సలు ( bypass surgeries):

ధమనులలో సంకుచిత భాగమును దాటించుకొని రక్త ప్ర సరణను పునరుద్ధ రిం చుటకు అధిగమన శస్త్రచికిత్సలు (bypass surgeries) అందుబాటులో ఉన్నాయి. రోగి దృశ్యసిరను కాని (Great saphenous vein), కృత్రిమ నాళమును (Gore-Tex graft) కాని, ధమనిలో సంకుచిత భాగమునకు ముందు ఒకకొనను, వెనుక రెండవ కొనను కలిపి కణజాలమునకు రక్తప్రసరణ పునరుద్ధింప జేస్తారు.

137 ::