పుట:Hello Doctor Final Book.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తగిన ఔషధములతోను అదుపులో పెట్టుకోవాలి.  రక్తపుపోటు ఎక్కువయితే దానిని ఆహారనియమము, వ్యాయామము, ఔషధములతో అదుపులో పెట్టుకోవాలి. అల్పసాంద్రపు కొలెష్టరాలుని (Low density Lipoprotein) ఆహారనియమము, స్టాటిన్ (statins) మందులతో తగ్గించుకోవాలి. అధికసాంద్రపు కొలెష్టరాలుని (High Density Lipoprotein) పెంచుకోవాలి.ట్రైగ్స లి రైడుల (triglycerides) ఆహారనియమము, మందులతో తగ్గించుకోవాలి. ఏస్పిరిన్ ( Aspirin ) :

దూరధమనివ్యాధి లక్షణములు కలవారిలో ఏస్పిరిన్ వాడుక వలన ధమనులలో రక్తపుగడ్డలు ఏర్పడుట తగ్గుతుంది. హృద్ధమని సంఘటనలు, మస్తిష్క విఘాత సంఘటనలు తగ్గుతాయి. ఏస్పిరిన్ రక్తఫలకలు గుమికూడుటను (platelet aggregation) నివారిస్తుంది. కణజాల విధ్వంసము తగ్గిస్తుంది. క్లొ పిడోగ్రెల్ ( Clopidogrel ) :

ఏస్పిరిన్ వాడలేనివారిలో రక్తఫలకములు గుమికూడుటను నివారించి రక్తపు గడ్డలను అరికట్టుటకు క్లొపిడోగ్రెల్ ను ఉపయోగిస్తారు. ఏస్పిరిన్ క్లొపిడోగ్రెల్ రెండూ కలిపి వాడుట వలన పరిశోధనలలో అదనపు ప్రయోజనము కనబడలేదు. రెండిటి వాడకము వలన రక్తస్రావ ప్రమాదములు ఎక్కువయే అవకాశములు ఉన్నాయి. ఇదివరలో గుండెపోటు కలిగినవారిలో టికగ్రిలార్ (ticagrelor (Brilinta)) ప్రమాదకర హృదయ సంఘటనలను (Major Adverse Cardiac Events - MACE) తగ్గించుటకు ఏస్పిరిన్ తో పాటు ఉపయోగిస్తారు. సిలొష్ట జోల్ ( Cilostazol ) :

సిలొష్టజోల్ వాడుక వలన దూరధమని వ్యాధిగ్రస్థులు నడవగలిగే దూరము పెరుగవచ్చును. కాని పరిశోధనలలో దీర్ఘకాలిక ప్రయోజనములు కనిపించలేదు. హృద్ధమని సంఘటనలు, మర్త్యత్వములలో (mortality) తేడా కనిపించలేదు. సిలోష్టజోల్ వలన కాళ్ళలో పొంగులు కలుగవచ్చును.

136 ::