పుట:Hello Doctor Final Book.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధులకు (Coronary artery disease), మస్తిష్క రక్తనాళ విఘాతములకు (cerebro vascular accidents) అధిక సంఖ్యలో పాలవుతారు. ఉదర బృహద్ధమనిలో బుడగలు (abdominal aortic aneurysms) కూడా వీరిలో కలుగవచ్చును. అందువలన ఆ వ్యాధులను కనుగొను పరీక్షలు, వాటికి చికిత్సలు కూడా అవసరమే. చికిత్స : జీవనశైలిలో మార్పులు ( Life style modification ):ధూమపాన విరమణ :

దూరధమని వ్యాధిగ్రస్థులు ధూమపానమును (tobacco smoking) తప్పక విరమించాలి. నా నలుబది సంవత్సరముల వైద్యవృత్తి ప్రత్యక్ష అనుభవములో రక్తప్రసరణ లోపము వలన కాళ్ళు కోల్పోయిన వారిలో 95 శాతము మంది ధూమపానీయులే. అందువలన పొగత్రాగుట తప్పకుండా మానాలి. వ్యాయామము ( exercise ) :

దూరధమని వ్యాధిగ్రస్థుల శిక్షణపూర్వక వ్యాయామము అవసరము. నడక యంత్రములపై గాని (treadmills, exercise bicycles, and ellipticals), నేలపైన గాని కాళ్ళలో నొప్పులు పుట్టే సమయమునకు కొంచెము సమయము తగ్గించి నడుస్తూ, విరామము తీసుకుంటూ దినమునకు 30 నుంచి 60 నిమిషముల వ్యాయమము చేస్తే సత్ఫలితములు కలుగుతాయి. కాళ్ళ వ్యాయామము వలన చిన్న (శాఖలు) ధమనుల పరిమాణము పెరిగి కణజాలమునకు ప్రత్యామ్నాయ ప్రసరణను (collateral circulation) పెంపొందిస్తాయి. వ్యాయామము వలన హృద్ధమని సంఘటనలు, (cardiovascular events), మస్తిష్క విఘాత సంఘటనలు (cerebro vascular events) కూడా తగ్గుతాయి. వీరు నొప్పి కలుగకుండా నడవగలిగే దూరము, సమయము కూడా పెరుగుతాయి. మధుమేహవ్యాధిని, ఆహారనియమముతోను, వ్యాయామము తోను,

135 ::