పుట:Hello Doctor Final Book.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యాధిగ్రస్థులలో ఈ నిష్పత్తి వ్యాధిని పసిగట్టుతుంది.

అధిక రక్తపీడనము (hypertension), మధుమేహవ్యాధి (diabetes mellitus), దీర్ఘకాల మూత్రాంగ వ్యాధుల (chronic kidney disease) వలన అతిసూక్ష్మ ధమనులు సంకోచించి ప్రసరణలోపము (small vessel disease) కలుగజేసినపుడు యీ నిష్పత్తి వ్యాధిని పసిగట్ట క పోవచ్చును.

ధమనీ కాఠిన్యత హెచ్చయి రక్తనాళముల గోడలలో కాల్సియమ్ పేరుకొనుట వలన చీలమండ దగఱ ్గ రక్తనాళములు అణచుటకు వీలుబడకపోతే (Noncompressible vessels) అంగుళి రక్తపీడనము/బాహు రక్తపీడనముల (toe pressure / upper arm pressure) నిష్పత్తిని వ్యాధి నిర్ణయమునకు పరిగణించవచ్చును.

వ్యాధి లక్షణములు ఉండి చీలమండ / బాహు రక్తపీడనముల నిష్పత్తి సాధారణ పరిమితులలో ఉంటే నడక యంత్రముపై (treadmill) ఐదు నిమిషముల వ్యాయామము చేయించిన తర్వాత ఆ యా రక్తపీడనములు కొలిచి చీలమండ / బాహువుల ముకుళిత రక్తపీడనముల నిష్పత్తిని తీసుకొని వ్యాధి నిర్ణయము చేయవచ్చును. వ్యాధిగ్రస్థులలో వ్యాయామము పిదప చీలమండ / బాహువుల నిష్పత్తి 20 శాతము తగ్గుతుంది. శ్రవణాతీతధ్వని చిత్రీకరణముతో (ultrasonography) రక్తనాళముల చిత్రములను గ్రహించి సంకుచితములు పొందిన భాగములను గుర్తించవచ్చును. రక్తనాళముల లోనికి సన్నని నాళికను (catheter) చొప్పించి దాని ద్వారా వ్యత్యాస పదార్థములను (contrast material) ఎక్కించి ఎక్స్ -రే లతో రక్తనాళములను చిత్రీకరించవచ్చును. వ్యత్యాస పదార్థములు యిచ్చి గణనయంత్ర (త్రిమితీయ) ధమనీ చిత్రీకరణములను (CT Angiograms), అయస్కాంత ప్రతిధ్వని ధమనీ చిత్రీకరణములను (magnetic resonance Angiography) చేసి వ్యాధిని ధ్రువీకరించవచ్చును. ఇతర సమస్యలు :

దూరధమని వ్యాధిగ్రస్లు థు ధమనీ కాఠిన్యత ప్రభావమువలన హృద్ధమని

134 ::