పుట:Hello Doctor Final Book.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పృష్ఠ జంఘికధమని (posterior tibial artery ) అరపాదమునకు చేరి మధ్యస్థ పాదతల ధమని (medial plantar artery), పార్శ్వ పాదతల ధమనులుగా (lateral plantar artery) శాఖలు చెంది అరకాలికి రక్తప్రసరణ సమకూర్చుతాయి. పార్శ్వ పాదతల ధమని (lateral plantar artery) కాలి మడమనుంచి పాదములో ప్రక్క భాగమునకు పయనించి పిదప మధ్య భాగమువైపు పాదతల ధమనీ చాపముగా (Plantar arterial arch) విల్లు వలె సాగి పాదతలమునకు చొచ్చుకొను ఊర్ధ్వ పాదధమని శాఖయైన నిమ్నపాద ధమనితో (deep plantar artery of dorslis pedis artery) కలుస్తుంది. పాదతల ధమనీ చాపము (plantar arterial arch) నుంచి అంగుళిక ధమనీ శాఖలు (digital arteries) కాలివేళ్ళకు రక్తప్రసరణ సమకూర్చుతాయి. ధమనుల నిర్మాణము :

ధమనుల గోడలలో బయటపొర (tunica externa or advenitia), మధ్యపొర (tunica media), లోపొర (tunica interna or intima) అనే మూడు పొరలు ఉంటాయి. బయట పొరలో సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) ఉంటాయి. మధ్య పొరలో మృదుకండరములు (smooth muscles), సాగుకణజాలము (elastic tissue), పీచుకణజాలము (fibrous tissue) పీచుపదార్థము (collagen) ఉంటాయి. నాళపు లోపొర పూతకణములు (lining cells), సాగుపదార్థము (elastin), పీచుపదారము ్థ ల (collagen) మూలాధారమును (basement) అంటిపెట్టుకొని ఉంటాయి. పెద్ద రక్తనాళములకు రక్తము సరఫరా చేసే రక్తనాళ రక్తనాళికలు (vasa vasorum) కూడా రక్తనాళపు గోడలలో ఉంటాయి. దూర ధమనుల వ్యాధి :

ధమనీ కాఠిన్యత (arteriosclerosis) శైశవమునుంచి మొదలిడి మధ్యవయస్సు తర్వాత కనిపించి వృద్ధాప్యములో తీవ్రతరము అవుతుంది. ఈ ప్రక్రియలో ధమనుల లోపొర (intima) క్రింద కొవ్వులు, కొలెష్టరాలు,

129 ::