ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వ జంఘిక ధమని (anterior tibial artery) పైపాదములో ఊర్ధ్వపాద ధమనిగా (Dorsalis pedis artery) కొనసాగుతుంది. ఊర్ధ్వపాద ధమని (dorsalis pedis artery) నుంచి మధ్యపాద ధమని శాఖ (metatarsal artery, (or) arcuate artery) వెలువడి మధ్యసము (medial) నుంచి నడిపాదములో ఊర్ధ్వపాద చాపముగా (dorsal plantar arch) పార్శ్వ భాగమునకు కొనసాగుతుంది. ఊర్ధ్వపాద ధమని, ఊర్ధ్వపాద చాపముల నుంచి అంగుళిక ధమనులు (digital arteries ) కాలివేళ్ళ పైభాగములకు రక్తప్రసరణ చేకూరుస్తాయి.
- 128 ::