పుట:Hello Doctor Final Book.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొలెష్ట రా లును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహవ్యాధిని అదుపులో పెట్టుకోవాలి. హృదయముపై వ్యతిరేకముగా పనిచేసే ఔషధాల వాడుకను నియంత్రించుకోవాలి.

మద్యము, కొకైన్, మిథేంఫిటమిన్ వంటి మాదక ద్రవ్యాల వాడుకను మానివేయాలి. ప్రాణవాయువు ( Oxygen ) :

ప్రాణవాయువు సంతృప్తత (capillary oxygen saturation) తగ్గిన వారికి, ఆయాసము గలవారికి ప్రాణవాయువును కృత్రిమముగా అందించాలి.

ఊపిరితిత్తులలో నీటిపొంగు ఔషధములకు త్వరగా తగ్గ క , రక్త పు ప్రాణవాయువు విలువలు బాగా తగ్గి న పుడు, బొగ్గ పు లుసు వాయువు ప్రమాణములు బాగా పెరిగినపుడు, కృత్రిమ శ్వాసపరికరములను (ventilators) ఉపయోగించవలసి ఉంటుంది. రక ్తశుద్ధి ( Dialysis ) :

హృదయవైఫల్యముతో బాటు మూత్రాంగముల వైఫల్యము చివరి దశలో ఉన్నవారికి రక్త శు ద్ధి చేస్తూ వ్యర ్థ ప దార ్థ ము లను, ఎక్కువైన జల లవణములను కూడా తొలగించాలి. అందఱిలో యీ రక్త శు ద్ధి సాధ్యము కాదు. శస్త్రచికిత్సలు :

హృద్ధమనుల వ్యాధి ఉన్నవారికి ధమనుల వ్యాకోచ ప్రక్రియలు (angioplasty with stent placement), లేక ధమనీ అవరోధ అధిగమన శస్త్రచికిత్సలు (Arterial bypass surgery) చేసి హృదయమునకు రక్తప్రసరణను పునరుద్ధింపజేయాలి. హృదయములో విద్యుత్ప్రేరణ ఉత్పత్తిలోను (generation of electrical impulse), విద్యుత్ప్రేరణ ప్రసరణలలో (conduction of

125 ::