పుట:Hello Doctor Final Book.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

tors) వాడునపుడు, ష్టీరాయిడులు కాని  తాపహరులను ( non steroidal anti inflammatory agents) వాడేవారిలోను పొటాసియము అధికమయే అవకాశము ఎక్కువ. పొటాసియమ్ విలువలను తఱచు పరిశీలించాలి. హృదయ వైఫల్యము తీవ్రమయిన వారిలో యివి రోగ లక్షణములు నివారించుటకు, ఆయువును పెంచుటకు ఉపయోగపడుతాయి. ఇతర ఔషధములు :

జఠరికల ముకుళింపును పెంపొందించే డోపమిన్ (dopamine), డోబ్యుటమిన్ (dobutamine) మిల్రినోన్ (milrinone) హృదయ వైఫల్యము తీవ్రతరమైన వారిలో ఉపయోగపడుతాయి. వీటిని సిరల ద్వారా రోగులను నిత్యము గమనిస్తూ వైద్యశాలలలో వాడుతారు. సాక్యుబిట్రిల్ వాల్సార్ట న్ ( Sacubitril / Valsartan ) :

దీనిలో వాల్సార్టన్ ఏంజియోటెన్సిన్ గ్రాహక నిరోధకము (angiotensin receptor blocker). సాక్యుబిట్రిల్ హృదయ కండర కణములు ఉత్పత్తి చేసే నేట్రియురెటిక్ పెప్టైడు విధ్వంసమును అడ్డుకుంటుంది. ఆ రెండు రసాయనములు రక్త పీ డనమును తగ్గి స్తా యి. మూత్రపు ఉత్పత్తిని పెంచి రక్త ప రిమాణమును తగ్గి స్తా యి. ఈ ఔషధ మిశ్రమము ప్రసరణ శాతము (ejection fraction) తగ్గిన వారికి ఉపయోగపడుతుంది. రక్త హీ నము (anemia), గళగ్రంథి ఆధిక్యత, గళగ్రంథిలోపము, బెరిబెరి వంటి వ్యాధులు ఉన్నవారికి ఆ యా వ్యాధుల చికిత్సలు అవసరము. జీవనశైలి మార్పులు :

హృదయ వైఫల్యము ఉన్నవారు ఉప్పును పరిమితముగా వాడుకోవాలి. త్రాగే నీటిని కూడా దినమునకు ఒకటిన్నర, రెండు లీటర్లకు పరిమితము చేసుకోవాలి. మూత్రకారకములు వాడుతూ నీళ్ళు ఎక్కువగా త్రాగేవారిలో సోడియమ్ విలువలు బాగా తగ్గిపోయే అవకాశము ఉన్నది. పొగత్రాగరాదు. విపరీత లక్షణములు లేని వారు తగినంత వ్యాయామము చెయ్యాలి. ఊబకాయము ఉన్నవారు బరువు తగ్గుటకు కృషి చెయ్యాలి.

124 ::