పుట:Hello Doctor Final Book.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉండి, మితముగా  నీటి నిలువలు పెరిగి, మూత్రాంగముల వ్యాపారము బాగున్న వారిలో ఇవి ఉపయోగపడుతాయి. మెటోలజోన్ ( metolazone )

మెటోలజోన్  థయజైడ్ మూత్రకారకమే గాని మూత్ర నాళికల (renal tubules) ప్రథమ, అంతిమ భాగాలపై పనిచేసి, మెలిక మూత్ర కారకములతో (loop diuretics) కలిపి వాడేటపుడు మూత్రాంగ వ్యాపారము (renal function) మందగించినవారిలో ఉపయోగ పడుతుంది. మెలిక మూత్రకారకములు ( Loop diuretics ) :

ఫ్యురొసిమైడ్ (furosemide), టోర్సిమైడ్ (torsemide), బ్యుమటిడిన్ (bumetanide), ఎథాక్రినిక్ ఏసిడ్ ( ethacrynic acid) : వీనిని లూప్ డైయూరెటిక్స్ అని అంటారు. మూత్రాంగములలో మూత్రనాళికల ( Nephrons) మెలికలపై (loops) పనిచేసి మూత్ర ఉత్పత్తిని అధికము చేస్తాయి. వీటిని వాడే వారిలో పొటాసియమ్ కూడ వ్యరమ ్థ వుతుంది. కాబట్టి పొటాసియంని, పొటాసియము పొదుపు చేసే మూత్రకారకములను కూడా సాధారణముగా వీటితో బాటు వాడవలసి ఉంటుంది. మూత్రాంగముల వ్యాపారము తగ్గినవారిలో కూడా ఇవి పనిచేస్తాయి. పొటాసియము పొదుపు పఱచే మూత్రకారకములు ( potassium sparing diuretics ) :

ఇవి ఆల్డోష్టిరోన్ గ్రాహకములను (aldosterone receptors) నిరోధించి మూత్రము అధికము చేస్తాయి. పొటాసియము పొదుపుచేస్తాయి. ఇవి సాధుమూత్ర కారకములు. అందువలన సాధారణముగా లూప్ మూత్ర కారకములతో బాటు వాడుతారు.

స్పైరనోలేక్టోన్ (spironolactone), ఎప్లిరినోన్ (eplirenone) వాడుకలో ఉన్నవి. వీటి వాడుక వలన రక్తములో పొటాసియము పెరిగే అవకాశము ఉన్నది. మూత్రాంగముల వ్యాపారము బాగా మందగించినపుడు, ఏంజియోటెన్సిన్ కన్వెర్టింగ్ ఎంజైమ్ నిరోధకములను (ACE inhibi:: 123 ::