పుట:Hello Doctor Final Book.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సర్దుబాటు చెయ్యాలి.

కొందఱిలో వీటివలన దగ్గు కలుగవచ్చును. రక్తద్రవములో పొటాసియమ్ విలువలు ఎక్కువ కావచ్చును. నాలుక, పెదవులు, కనురెప్పలలో అసహనపు పొంగు (Angio edema) కలుగుతే ఈ మందుల వాడుకను వెంటనే మానివేయాలి. ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములు (Angiotensin Receptor Blockers)

ఇవి ఏంజియోటెన్సిన్ గ్రాహకములను అవరోధిస్తాయి. ACE Inhibitors ని దగ్గు మొదలైన కారణాల వలన  సహించలేని వారికి ఇవి తోడ్పడుతాయి. ఈ మందులు వాడేవారిలో మూత్రాంగ వ్యాపారమును, పొటాసియమ్ విలువలను గమనిస్తూ ఉండాలి. రక ్తనాళ వ్యాకోచకములు ( Vasodilators ) : హైడ్రాలజిన్ ( Hydralazine ) :

హైడ్రాలజిన్ ధమనులను వ్యాకోచింపజేసి వానిలో పీడనము తగ్గిస్తుంది. అందువలన గుండెకు శ్రమ తగ్గుతుంది. నై ట్రేట్లు ( nitrates ) :

ఇవి సిరలను వ్యాకోచింపజేసి వాటిలో సాంద్రత (venous congestion) తగ్గిస్తాయి. పుపుస సిరలలో  కూడా సాంద్రత (pulmonary congestion) తగ్గిస్తాయి. జఠరికలలో పూరక పీడనము (ventricular filling pressure) తగ్గించి గుండెకు శ్రమను తగ్గిస్తాయి. హృద్ధమనులను వ్యాకోచింపజేసి హృదయానికి రక్తప్రసరణ పెంచుతాయి. వీటి వలన  రక్తపీడనము బాగా తగ్గే (hypotension) అవకాశము ఉన్నది. అందువలన మోతాదులను సవరించవలసిన అవసరము కలుగవచ్చును. డిజోక్సిన్ (Digoxin ) :

డిజిటాలిస్ ఉపక్షారములు (alkaloids) హృదయ ముకుళితమును

121 ::