పుట:Hello Doctor Final Book.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసరించే రక్తశాతమును (ejection fraction), జఠరిక వ్యాపార నైపుణ్యమును పెంచి వ్యాయామ సహనమును (exercise tolerance) పెంచుతాయి. లయ భేదములను అదుపులో ఉంచి జీవిత కాలమును పెంచుతాయి. వీటిని తక్కువ మోతాదులలో మొదలుపెట్టి రక్తపుపోటు, గుండెవేగము, రోగ లక్షణములను గమనిస్తూ అవాంఛిత ఫలితములు రానంత మేరకు మోతాదులను క్రమముగా పెంచుతారు. ఏంజియోటెన్సిన్ ను మార్చే జీవోత్ప్రేరకపు అవరోధకములు (Angiotensin Converting Enzyme inhibitors)

    ఏంజియోటెన్సినోజెన్ (angiotensinogen) కాలేయములో ఉత్పత్తి అయి మూత్రాంగములలో ఉత్పత్తి అయే రెనిన్ (Renin) వలన ఏంజియోటెన్సిన్-1 గా మారుతుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్ట ిం గ్ ఎంజైమ్  ఏంజియోటెన్సిన్-1 ని ఏంజియోటెన్సిన్-2 గా మారుస్తుంది. ఏంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్లు ఆ జీవోత్ప్రేరకమును (enzyme) నిరోధించి ఏంజియోటెన్సిన్ -2 ఉత్పత్తిని తగ్గిస్తాయి. అందువలన రక్తనాళముల బిగుతు తగ్గి రక్తపీడనము తగ్గుతుంది.గుండెకు శ్రమ తగ్గుతుంది. ప్రధాన అవయవములకు రక్తప్రసరణ పెరుగుతుంది. రెనిన్ - ఏంజియోటెన్సిన్ వ్యవస్థ వలన సమకూడే లవణపు నిలువలు, నీటి నిలువలు తగ్గి రక్త పరిమాణము తగ్గుతుంది. హృదయముపై పనిభారము, హృదయపు శ్రమ తగ్గుతాయి. ఈ ఔషధముల వలన హృదయవైఫల్య లక్షణములు తగ్గి, రోగుల ఆయుఃప్రమాణము పెరుగుతుంది.

హృదయవైఫల్య లక్షణములు పొడచూపకపోయినా ఎడమ జఠరిక వ్యాపారము మందగించిన వారిలోను (జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గిన వారిలో), హృదయ ధమనుల వ్యాధి (Coronary artery disease ) కలవారిలోను, అధిక రక్తపీడనము, మధుమేహవ్యాధి కలవారిలోను ACE Inhibitors హృదయ వైఫల్యమును అరికట్టుటకు ఉపయోగ పడుతాయి. తక్కువ మోతాదులలో మొదలుపెట్టి క్రమముగా రక్త పీ డనమును, మూత్రాంగ వ్యాపార పరీక్షలను, రక్త ము లో పొటాసియం విలువలను,  రక్తకణ గణనములను గమనిస్తూ మోతాదులను

120 ::