పుట:Hello Doctor Final Book.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

netic Resonance Imaging Scan) హృదయ నిర్మాణ, వ్యాపారాలను, వ్యాధులను  కనుగొనవచ్చును. హృదయవై ఫల్యపు అంతస్థులు :

1 వ శ్రేణి : వీరికి హెచ్చు శరీరపు శ్రమతో ఆయాసము కలుగుతుంది. 2 వ శ్రేణి : వీరికి మధ్య తరహా శ్రమతో ఆయాసము కలుగుతుంది 3 వ శ్రేణి : వీరికి కొద్దిపాటి శ్రమకే ఆయాసము కలుగుతుంది.

4 వ శ్రేణి : వీరికి విశ్రాంతి సమయములో కూడా ఆయాసము ఉంటుంది. చికిత్స :

హృదయ వైఫల్యము వలన శరీరములో కలిగే అవాంఛిత పరిణామాలను అవరోధించుట చికిత్సలో ముఖ్యభాగము. సహవేదన నాడీమండలము (sympathetic nervous system)  ఉత్తేజము పొందుట వలన విడుదల అయే కాటిఖాలైమన్లను (catecholamines) అవరోధించుటకు బీటా గ్రాహక అవరోధకములను (beta adrenergic blockers ), రెనిన్ ఏంజియోటెన్సిన్ ఆల్డోష్టిరోన్ వ్యవస్థతో విడుదల అయే ఆల్డోష్టిరోన్ ఫలితములను అరికట్టుటకు ఏంజియోటెన్సిన్ 1 ని ఏంజియోటెన్సిన్ 2 గా మార్చే జీవోత్ప్రేరకపు నిరోధకములను ( Angiotensin Converting Enzyme inhibitors), ఆల్డోష్టిరోన్ గ్రాహక అవరోధకములను (aldosterone receptor blockers ), రక్తనాళములను వ్యాకోచింపజేసి గుండె శ్రమను తగ్గించే ఔషధములను (vasodilators), శరీరములో లవణము, నీరు ఎక్కువ అయి కాళ్ళు, పాదములలో పొంగులు, ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు కలిగినపుడు మూత్ర కారకములను (diuretics) వైద్యులు ఉపయోగిస్తారు. బీటా గ్రాహక అవరోధకములు ( Beta receptor blockers ) :

హృదయ వైఫల్యములో సత్ఫలితాలను ఇచ్చేవి కార్వెడిలాల్ (carvedilol), మెటోప్రొలాల్ (metoprolol), బిసోప్రొలాల్ (besoprolol). ఇవి గుండెపై ఒత్తిడిని, గుండె వేగమును తగ్గిస్తాయి. రక్తనాళములలో పోటుని తగ్గించి గుండె శ్రమను తగ్గిస్తాయి. ఎడమ జఠరిక నుంచి బృహద్ధమని లోనికి

119 ::