పుట:Hello Doctor Final Book.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడుతాయి. హృదయప్రతిధ్వని చిత్రీకరణము ( Echocardiogram ) :

శ్రవణాతీత ధ్వనిచిత్రీకరణ సాధనముతో హృదయ ప్రతిధ్వని చిత్రీకరణము (echocardiogram) చేసి హృదయ నిర్మాణమును, హృదయములో రక్త చలనమును, కవాటముల వ్యాపారములను తెలుసుకొనవచ్చును. ఎడమ జఠరిక సంపూర్ణ వికాసము పొందినపుడు రక్త పరిమాణమును (end diastolic volume), సంపూర్ణముగా ముకుళించుకొన్నపుడు రక్తపరిమాణమును (end systolic volume) గణించి ఎడమ జఠరిక నుంచి బృహద్ధమనికి ప్రసరించు  రక్తశాతమును (ఎడమ జఠరిక ప్రసరణ శాతము / left ventricular  ejection fraction) కనుగొన వచ్చును. సాధారణముగా వయోజనులలో ఈ ప్రసరణ శాతము 55 % నుంచి 65 % శాతము ఉంటుంది. హృదయ కండర వికాసలోపము వలన హృదయవైఫల్యము (diastolic failure) కలిగిన వారిలో జఠరిక నుంచి బృహద్ధమని లోనికి ప్రసరించు రక్తశాతపు విలువలు సాధారణ పరిమితులలో (50 % శాతము కంటె ఎక్కువగా ) ఉంటాయి. జఠరికలో కండరనష్టము, లేక కండరవ్యాపారములో లోపము ఉన్నవారిలో  ఎడమ జఠరిక ముకుళించుకొనుటలో లోపము కలిగి  (systolic failure) బృహద్ధమనికి ప్రసరించు రక్తశాతము (ejection fraction) తగ్గుతుంది.

హృదయవైఫల్యము ముకుళితలోపము (Systolic heart failure) వలన కలిగిందో, లేక వికాసలోపము వలన (Diastolic heart failure) కలిగిందో నిశ్చయించుటకు ప్రసరణ శాతము (ejection fraction) తోడ్పడుతుంది.

హృదయ ధమనుల వ్యాధి లక్షణములు ఉన్నవారికి హృద్ధమనీ చిత్రీకరణ (Coronary  angiogram) అవసరము. హృదయమునకు  అయస్కాంత ప్రతిధ్వని చిత్రీకరణము చేసి (Mag:: 118 ::