పుట:Hello Doctor Final Book.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలేయ వ్యాపారపరీక్షలు (liver function tests), గళగ్రంథి స్రావక పరీక్షలు (thyroid hormones), రక్తములో చక్కెర విలువలు, కొలెష్ట్రాలు, యితర కొవ్వుపదార్థాల పరీక్షలు కూడా అవసరమే. బి- నేట్రియురెటిక్ పెపటై ్ డ్ (B type Natriuretic Peptide) :

హృదయవైఫల్యము కలవారిలో  రక్తఘనపరిమాణము పెరిగి గుండె అరలు సాగి, వాటి పరిమాణములు పెరిగినపుడు హృదయ కండరకణములు బి- నేట్ర్రియురెటిక్ పెప్టైడ్ అనే రసాయనమును అధికముగా ఉత్పత్తి చేస్తాయి. హృదయవైఫల్యము గలవారిలో బి నేట్రియురెటిక్ పెప్టైడు విలువలు 400 మించి ఉంటాయి. ఆ విలువ 100 కంటె తక్కువైతే హృదయ వైఫల్యము లేదని నిర్ధారించవచ్చును. మూత్రాంగవ్యాపార లోపము ఉన్నవారిలో యీ విలువలు ఎక్కువగా ఉండవచ్చును. ఛాతి ఎక్స్-రే :

వీరికి ఛాతి ఎక్స్ రే అవసరము. ఊపిరితిత్తులలో ఎక్కువ సాంద్రతను ( congestion ), నీటి ఉబ్బును ( Pulmonary edema) కనుగొనుటకు ఆయాసముకలిగించేఊపిరితిత్తులతాపము(Pneumonia),పుపుసవేష్టనములో గాలి (వాయు పుపుసవేష్ట న ము; Pneumothorax) వంటి ఇతర ఊపితిత్తుల వ్యాధులను, జల పుపుసవేష్టనము (Pleural effusion) కనుగొనుటకు ఎక్స్ రే చిత్రములు ఉపయోగ పడుతాయి. హృదయవైఫల్యము గలవారి ఎక్స్-రే చిత్రములలో హృదయ పరిమాణము పెరుగుట, ఊపిరితిత్తులలో ద్రవ సాంద్రత పెరుగుట, ఊపిరితిత్తుల పై భాగములలో రక్తనాళికలు ప్రస్ఫుటమగుటచే, కెర్లీ ‘బి‘, రేఖలను వైద్యులు గమనించగలరు. హృదయవిద్యుల్లే ఖ ( Electrocardiogram ) :   

విద్యుత్ హృల్లేఖనములు హృదయ ధమనుల వ్యాధిని (Coronary artery disease) సూచించవచ్చు. హృదయ లయలో భేదములను, (arrhythmias), హృదయములో (విద్యుత్ప్రేరణ) ప్రసార మాంద్యములను (conduction delays) కనుగొనుటకు విద్యుత్ హృల్లేఖనములు ఉపయోగ

117 ::