పుట:Hello Doctor Final Book.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

er enzymes) విలువలు పెరుగవచ్చును. పచ్చకామెర్లు కూడా కలుగవచ్చును. ఉదరకుహరములో నీరు పట్టి జలోదరము (ascites) కలిగించవచ్చును.

వైద్యులు పరీక్షలో పాదములలోను,  చీలమండ వద్ద నీటిపొంగును గుర్తించగలరు. చీలమండవద్ద వేలితో నొక్కిపెట్టి ఉంచితే లొత్త పడుతుంది. (ఇతర కారణములు కూడా నీటిపొంగును కలిగించవచ్చును). ఈ పొంగు కాళ్ళ క్రింది భాగములకు వ్యాపించ వచ్చును.

వినికిడి గొట్టముతో విన్నపుడు సామాన్యముగా వినిపించే మొదటి, రెండవ గుండెశబ్దములతో బాటు మూడు లేక నాల్గవ శబ్దములు కూడా వినిపించవచ్చును. గుండె శబ్దములు గుఱ్ఱపుదాట్ల వలె (galloping) ఉండవచ్చును. త్రిపత్ర ద్విపత్ర కవాటముల పరిమాణము పెరిగి తిరోగమన రక్తప్రవాహము (regurgitation) కలిగితే మర్మర శబ్దములు (murmurs) కూడా వినిపించవచ్చును. ఛాతిపై విన్నపుడు క్రిందిభాగములలో చిటపట శబ్దములు వినిపించవచ్చును. కంఠసిరలలో ఉబ్బుదల కనిపెట్టగలరు. పుపుసవేష్టనములో నీరు (జల పుపుసవేష్టనము; pleural effusion) పట్టవచ్చును. సాధారణము కాకపోయినా, హృదయకోశములో కూడా నీరు పట్టవచ్చును (జల హృత్కోశము; pericardial effusion). కాలేయములో సాంద్రత పెరుగుట వలన కాలేయ పరిమాణము పెరుగవచ్చును. నెమ్మదిగా కాలేయభాగములో చేతిని అదిమితే కంఠసిరలలో ఉబ్బుదల గమనించగలరు (hepato jugular reflux). పరీక్షలు ( Investigations ) :

రక్తపరీక్షలు హృదయవైఫల్య లక్షణములు కలవారికి రక్తకణ పరీక్షలు, రక్తవర్ణకము (Haemoglobin), రక్తములో రక్తకణ పరిమాణ శాతము (hematocrit) పరీక్షించి రక్తహీనత లేదని నిర్ధారణ చేసుకోవాలి. రక్తములో సోడియమ్, పొటాసియమ్, క్లోరైడు, బైకార్బొనేట్ల (విద్యుద్వాహక లవణముల) విలువలను, మూత్రాంగ వ్యాపారమును (renal function) తెలిపే యూరియా నైట్రొజెన్, క్రియటినిన్ విలువలను తెలుసుకొనుట అవసరము. చికిత్స పొందుతున్న వారిలో యీ పరీక్షలను మధ్య మధ్యలో పరిశీలించుట కూడా  చాలా అవసరము.

116 ::