పుట:Hello Doctor Final Book.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(cardiac arrhythmias), బలహీనతలు కలిగి, హృదయ వైఫల్యమునకు దారితీస్తాయి. శరీరములో లవణ పరిమాణము జలపరిమాణము  పెరిగి సిరలలో సాంద్రత (congestion) పెరుగుతుంది. వివిధ అవయవములకు రక్తప్రసరణ తగ్గుటచే అవయవముల క్రియాశక్తి కూడా తగ్గే అవకాశము ఉంది. హృదయవై ఫల్య లక్షణములు :

హృదయ వైఫల్యము గలవారు ఆయాసము గమనిస్తారు. తొలుత ఆయాసము శ్రమతో మొదలిడినా, హృదయ వైఫల్యము తీవ్రతరమయినపుడు విశ్రాంతి సమయాలలో కూడా ఆయాసము కలుగుతుంది. నీరసము, త్వరగా అలసిపోవుట, వ్యాయామమునకు, శారీరకశ్రమకు ఓర్చుకోలేకపోవుట, రాత్రులందు ఆకస్మికముగా ఆయాసము కలుగుట, బల్లపరపుగా పడుకున్నపుడు ఊపిరి ఆడకపోవుట (orthopnea) కలుగుతాయి.

సిరలలో రక్తపు సాంద్రత ఎక్కువై శరీరపు క్రింది భాగములలో నీరుపట్టి, కాళ్ళు, చేతులు పొంగుట, పుపుస సిరలలో రక్తపు సాంద్రత పెరుగుట వలన పుపుస గోళములలో (alveoli) నీరు పట్టి దగ్గు, ఆయాసము, ఊపిరితో పిల్లికూతలు (wheezing) కలుగుతాయి గుండెదడ, కళ్ళుతిరుగుట, నిలుచున్నపుడు తాత్కాలిక అపస్మారము రావచ్చును. గుండెనొప్పి కూడా కలుగవచ్చును. గుండెలో అసాధారణ లయలు (arrhythmias) కలుగుతే వాటి లక్షణములు (గుండెదడ, అపస్మారక స్థితి, ఆకస్మికముగా గుండె ఆగిపోవుట) కలుగ వచ్చును.

హృదయ వైఫల్యము తీవ్రతరమైనపుడు, మూత్రాంగముల వ్యాపారము మందగించి వ్యర్థపదార్థముల విసర్జన, మూత్రపరిమాణము తగ్గవచ్చును. అపుడు శరీరములో లవణము, నీటి నిలువలు పెరిగి  పొంగులు (edema), ఊపిరితిత్తులలో నీటి ఉబ్బు (pulmonary edema) అధికమవుతాయి. కాలేయములో ద్రవసాంద్రత పెరిగితే (hepatic congestion) కాలేయ వ్యాపారము మందగించవచ్చును. కాలేయ జీవోత్ప్రేరకముల (liv:: 115 ::