పుట:Hello Doctor Final Book.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూత్రాంగములు(kidneys)తోడ్పడుతాయి.

కర్ణికలు ముకుళించుకున్నపుడు జఠరికలు వికసించుకొని రక్తమును కర్ణికలనుంచి గ్రహించుకుంటాయి. జఠరికలు ముకుళించుకొన్నపుడు కర్ణికలు జఠరికల మధ్య ఉండు కవాటములు మూసుకొని రక్త తిరోగమనమును నిరోధిస్తాయి. రక్తము పుపుసధమని, బృహద్ధమనులకు నెట్టబడుతుంది. హృదయ కండరములు బలహీనపడినా, హృదయముపై అధికప్రసరణ భారము కలిగినా గుండె దేహమునకు తగినంత రక్తమును ప్రసరించలేనప్పుడు హృదయ వైఫల్యము కలుగుతుంది. దానిని అధిగమించుటకు శరీరములో ఇతర పరిణామములు కలుగుతాయి. హృదయనిర్మాణములో అవాంఛిత పరిణామములు కలుగుతాయి. హృదయ కండరములో ఉబ్బుదల (cardiac hypertrophy), హృదయ పరిమాణములో పెరుగుదల (cardiac dilatation) కలిగి హృదయము శంకువు ఆకారము కోల్పోయి స్తూపాకారము పొందుతుంది. స్తూపాకారము వలన జఠరికల సంకోచ సామర్థ్యము ( efficiency ) తగ్గుతుంది.

రెనిన్ ఏంజియోటెన్సిన్ - ఆల్డోష్టిరోన్ వ్యవస్థ (renin angiotensin aldosterone system), మూత్ర ఉత్పత్తిని తగ్గించే వాసోప్రెస్సిన్ లు (Vasopressin -  Anti diuretic hormone ADH) ఉత్తేజింప బడుటచే దేహములో దూర రక్తనాళములు సంకోచిస్తాయి (Peripheral vasoconstriction). ఉప్పు, నీరుల నిలువలు పెరిగి శరీరములో రక్తపు ఘనపరిమాణము కూడా పెరుగుతుంది. అందువలన గుండెపై ఒత్తిడి కూడా హెచ్చవుతుంది. సహవేదన నాడీమండల ఉధృతి వలన రక్తములో ఎడ్రినలిన్, నారెడ్రినలిన్ వంటి కాటిఖాలమైనులు (catecholamines) పెరిగి గుండె వేగమును, హృదయకండరముల ముకుళింపును (contractility) పెంచుతాయి. అందువలన హృదయమునకు ప్రాణవాయుపు అవసరము కూడా పెరుగుతుంది. నాడీప్రసారిణుల (neurotransmitters) ప్రభావము వలన గుండెలో కణవిధ్వంసము, తంతీకరణము (fibrosis), అసాధారణ లయలు

114 ::