పుట:Hello Doctor Final Book.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10. హృదయవై ఫల్యము (Congestive Heart Failure) నిర్మాణములో లోపముల వలన గాని, వ్యాపారములో లోపముల వలన కాని గుండె వివిధ అవయవములకు అవసరమయిన రక్తమును అందించలేక పోవుటను హృదయ వైఫల్యముగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా గుండె ఆగిపోవుట, లేక గుండెపోటు అని కాని అపార్థము చేసుకోకూడదు. హృదయ వైఫల్యము సాధారణముగా క్రమేణా ముదిరే దీర్ఘకాలిక వ్యాధి. గుండెపోటు వంటి కారణముల వలన హృదయ వైఫల్యము త్వరితముగా పొడచూపవచ్చును. హృదయవైఫల్యపు రోగులు ప్రపంచములో సుమారు నాలుగు కోట్లమంది ఉంటారు. అరవైయైదు సంవత్సరాలకు పై బడిన వారిలో ఐదు నుంచి పది శాతము మంది దీనికి గుఱి అవుతారు. కారణాలు

హృదయ ధమనుల కాఠిన్యత (atherosclerosis of coronary arteries), హృదయ రక్తప్రసరణ లోపము (coronary insufficiency), రక్తపుపోటు (hypertension), మధుమేహవ్యాధి, రుమేటిక్ గుండెజబ్బు వలన కలిగే హృదయ కవాటవ్యాధులు ( valvular heart diseases ) హృదయవైఫల్యమునకు ముఖ్యకారణములు.

మితిమీరి మద్యము త్రాగుట, కొకైన్, మిథాంఫిటమిన్ వంటి మాదకద్రవ్యములు, విషపదార్థములు, కొన్ని ఔషధములు, విషజీవాంశములు (viruses), సూక్ష్మాంగజీవులు, స్వయంప్రహరణ వ్యాధుల ( autoimmune diseases ) వలన హృదయ కండరములలో కలిగే బలహీనత, తాపములు, హృదయ కండరములో యితర పదార్థములు పేరుకొనుట వలన కలిగే బలహీనత హృదయవైఫల్యమును కలిగించగలవు.

గళగ్రంథి ఆధిక్యత ( hyperthyroidism ), ధమనులు  సిరల

112 ::