పుట:Hello Doctor Final Book.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(after load reduction). శరీరమునకు రక్తప్రసరణ సమర్థమంత మవుతుంది. జఠరికలు వికాసము పొందినపుడు బుడగ సాధనములో గాలి (హీలియమ్) చేరి బుడగ వ్యాకోచించి హృద్ధ మ నులకు, శరీరమునకు రక్తప్రసరణను అందజేయుటకు ఉపకరిస్తుంది. హృదయ లయసవరణి ( Implantable Cardioverter - Defibrillator ; ICD) :

గుండెపోటు కలిగిన 48 గంటల తర్వాత జఠరిక అతివేగము (ventricular tachycardia) కలిగినవారిలోను, ఎడమ జఠరిక ప్రసరణ శాతము (ejection fraction) 35% కంటె తక్కువ ఉన్నవారిలోను జఠరిక ప్రకంపనము కలిగి [ventricular fibrillation; జఠరికలు ముకుళ వికాసములు చెందుట బదులు, ప్రకంపిస్తే రక్తప్రసరణ జరుగదు] ఆకస్మిక మరణములకు దారితీసే అవకాశములు ఉంటాయి. వీరికి హృదయ లయ సవరణి (Implantable Cardioverter-Defibrillator) అమర్చుటచే అట్టి మరణావకాశములను తగ్గించగలుగుతారు. గుండెపోటు నుంచి కోలుకొన్న వారికి చికిత్స :

అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటుల నుంచి కోలుకొన్నవారిలో రక్తపు పోటును, మధుమేహ వ్యాధిని నియంత్రించాలి. వారిచే ధూమపానము మాన్పించాలి. వారి రక్తములో అల్పసాంద్రపు కొలెష్ట్రాలను 70 మి.గ్రాలు లోపల ఉండునట్లు నియంత్రించాలి. వారికి తగిన వ్యాయామచికిత్స, వ్యాయామపు అలవాట్లు అలవఱచాలి. వారు ఏస్పిరిన్ ను, బీటాగ్రాహక అవరోధకములను ( beta receptor blockers), ఏస్ అవరోధకములను (ACE inhibitors), స్టాటిన్ (statins) ఔషధములను నిరంతరముగా కొనసాగించాలి. థీనోపైరిడిన్ ను తగినంతకాలము కొనసాగించాలి. గుండెపోటు కలిగిన వారిలో 20 శాతము మందికి మానసిక క్రుంగుదల (దిగులు) కలిగే అవకాశము ఉన్నది. వారి క్రుంగుదలకు తగిన చికిత్స సమకూర్చాలి.

111 ::