పుట:Hello Doctor Final Book.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారికి Glycoprotein 2b/3b inhibitors ఉపయోగపడుతాయి. హృద్ధ మని అవరోధ అధిగమన శస్త్రచికిత్స (Coronary artery bypass surgery ) :

వామ హృద్ధమని (left main coronary artery) కాని, వామపూర్వ అవరోహణ ధమని (left anterior descending artery) కాని, పెక్కు ధమనులు కాని వ్యాధిగ్రస్తము అయినపుడు ఆ అవరోధములను అతిక్రమించు శస్త్రచికిత్సలు అవసరము అవుతాయి. ఈ శస్త్రచికిత్సలో దృశ్యసిరలను (saphenous veins), అంతర స్తనధమనులను (internal mammary arteries) ఉపయోగిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్ల థు లో అవరోధ అధిగమన శస్త్రచికిత్సలు మెఱుగయిన ఫలితములను ఇస్తాయి. దృశ్యసిర (saphenous vein) భాగాలను వాడునపుడు వాటి ఒక కొనను బృహద్ధమనికి, రెండవకొనను హృద్ధమనిలో అవరోధము ఉన్న భాగమునకు ఆవలి పక్కన సంధానించి హృదయమునకు రక్తప్రసరణను పునరుద్ధరిస్తారు. గుండెపోటు (Myocardial Infarction) వలన ఎడమ జఠరిక గోడకు ద్విపత్ర కవాటమును సంధించే పాపిల్లరీ కండరాలకు హాని జరిగి ద్విపత్ర కవాటములో రక్తము తిరోగమనము చెందుట, జఠరికల నడిమి గోడలో రంధ్రము (Ventricular Septal Defect) ఏర్పడుట వంటి ఉపద్రవములు కలుగుతే సత్వర శస్త్రచికిత్సలు అవసరము. బృహద్ధ మనిలో బుడగ ( Intra aortic balloon pump ) :

పై సందర్భములలోను, గుండెపోటుల వలన, ఎడమ జఠరిక బృహద్ధమనికి సమర్థ వ ంతముగా రక్త ము ను ప్రసరించలేనపుడు, రక్త పీ డనము తగ్గి (హృదయజనిత విఘాతము / హృదయ జనిత ఉపద్రవము  Cardiogenic shock) శరీర కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుతే బృహద్ధమనిలో జఠిరికల ముకుళిత వికాసములకు ప్రతికూలముగా ముకుళిత వికాసములు పొందు బుద్బుద సాధనమును (counter pulsating intra aortic bulb) అమరుస్తారు. జఠరికలు ముడుచుకున్నపుడు ఈ బుడగ సాధనములో గాలి (హీలియమ్) తీసివేయబడుటచే గుండెకు శ్రమ తగ్గుతుంది

110 ::