పుట:Hello Doctor Final Book.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాధనములను (stents) అమర్చి రక్త ప్రసరణను పునరుద్ధరించు ప్రక్రియలు విశేషముగా వ్యాప్తిలోనికి వచ్చాయి. STEMI (ST elevation myocardial infarction) కలవారిలోను, కొత్తగా left bundle branch block కలవారిలోను, గుండె వెనుక భాగములో గుండెపోటు కలిగిన వారిలోను అతిత్వరగా (90 నిముషములలో) హృద్ధమనులను వ్యాకోచింప జేసి (angioplasty) అవరోధములను తొలగించి, వ్యాకోచ సాధనములు (stents)అమర్చి రక్తప్రసరణను పునరుద్ధరించు (Percutaneous intervention) ప్రక్రియ మొదలుపెట్టు ప్రయత్నము చెయ్యాలి. సత్వర PCI ప్రక్రియ వలన మరణముల సంఖ్యను, తదుపరి ఉపద్రవములను వైద్యులు తగ్గించగలుగుతున్నారు. రక ్తపుగడ్డ ల విచ్ఛేదన చికిత్స ( Thrombolytic therapy ) :

హృదయ ధమనులను వ్యాకోచింపజేసి (angioplasty) వ్యాకోచ సాధనములను (stents) అమర్చు సౌలభ్యము లేనియెడల హృద్ధమనులలో ఏర్పడిన రక్తపుగడ్డలను ఔషధములతో విచ్ఛేదించి రక్తప్రసరణను ఉద్ధరించ గలిగితే హృదయములో ప్రసరణ రహిత మరణభాగము (infarct area) తగ్గి, రోగులు బ్రతికే అవకాశములు మెరుగుపడుతాయి. దీనికి రెటిప్లేజ్ (Reteplase), టెనెక్టిప్లేజ్ (Tenecteplase) వంటి ఔషధములు వాడుతారు. అదివరలో మస్తిష్కములో రక్తస్రావము (intracerebral hemorrhage) జరిగిన వారిలోను, గత మూడునెలలలో మస్తిష్క విఘాతములు (cerebrovascular accidents)కలిగినవారిలోను, మస్తిష్క రక్తనాళపు వ్యాధులు (cerebrovascular lesions) ఉన్నవారిలోను, బృహద్ధమని విదళనపు (aortic dissection) అవకాశములు ఉన్నవారిలోను, ఇతర రక్తస్రావ వ్యాధులు ఉన్న వారిలోను, గత మూడు నెలలలో తలకు దెబ్బలు తగిలినవారిలోను రక్తపుగడ్డలను విచ్ఛేదించు ఔషధములను (thrombolytics) వాడకూడదు. హృద్ధమనులలో రక్తపుగడ్డలను ఔషధములతో విచ్ఛేదనము చేసిన రోగుల పరిస్థితి స్థిరపడిన తరువాత వారికి హృద్ధమని చిత్రీకరణము చేసి ఆపై అవసరమయిన చికిత్సలు చెయ్యాలి. అస్థిరపు గుండె నొప్పి, NSTEMI వ్యాధిగ్రస్ల థు లో గుండెపోటు కలిగే అవకాశములు ఉన్నచో

109 ::