పుట:Hello Doctor Final Book.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(ACE inhibitors ) హృదయ ఆకృతి మార్పుదలలను (remodeling) తగ్గించి హృదయ వైఫల్యములను  తగ్గించుటకు తోడ్పడుతాయి. గుండెపోటులను తగ్గించుటకు కూడా ఇవి తోడ్పడుతాయి. ఏస్ అవరోధకములను వాడలేనివారిలో ఏంజియోటెన్సిన్ గ్రాహక అవరోధకములను (Angiotensin Receptor Blockers) వాడుతారు. స్టా టిన్స్ ( Statins ) :

గుండెపోటులు, గుండెనొప్పులు కలిగినవారికి స్టాటిన్ మందులు చాలా త్వరగా మొదలుపెట్టాలి. ఇవి హృద్ధమని లోపలిపొర (endothelium) వ్యాపారమును, కాఠిన్య ఫలకలను (atherosclerotic plaques) సుస్థిరపరచి గుండెపోటులను తగ్గిస్తాయి. స్టాటిన్ మందులు అల్పసాంద్ర కొలెష్టరాలును తగ్గించి దీర్ఘకాలములో కూడా హృద్ధమని వ్యాధులను తగ్గిస్తాయి. ఆల్డోష్టి రోన్ అవరోధకములు ( Aldosterone blockers ) :

గుండెపోటులు కలిగినవారిలో ఎడమ జఠరిక వ్యాపారములో లోపములు ఉన్నచో ఆల్డోష్టిరోన్ అవరోధకములు స్పైరొ నోలాక్టోన్ ( spironolactone), కాని ఎప్లెరినోన్ (eplerenone) కాని ఉపయోగిస్తారు. ఇవి పీచుకణజాలము ఏర్పడుటను (collagen formation) తగ్గించి హృదయాకృతి మార్పుదలను (Remodeling) తగ్గించి, హృదయ వైఫల్యమును తగ్గిస్తాయి. మూత్రాంగ వ్యాధులు కలవారిలోను రక్తద్రవములో పొటాసియం ఎక్కువగా ఉన్నవారిలోను ఆల్డోష్టిరోన్ అవరోధకములను వాడినచో చాలా జాగ్రత్తగా వాడాలి. చర్మము ద్వారా రక ్తప్రసరణ పునరుద్ధ రణ ( Percutaneous intervention; PCI)  : చర్మము ద్వారా ఊరుధమని (femoral artery) లోనికి గాని, వెలుపలి ముంజేతి ధమని (Radial artery) లోనికి గాని కృత్రిమ నాళమును (catheter) చొప్పించి, బృహద్ధమని (aorta) లోనికి ఆపై హృద్ధమనుల లోనికి ప్రవేశించి వ్యత్యాస పదార్థములతో హృదయ ధమనుల చిత్రములు తీసుకొని సంకుచిత భాగములను వ్యాకోచింపజేసి వ్యాకోచ

108 ::