పుట:Hello Doctor Final Book.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ను (LMWH) వాడకూడదు. అవిభాగ హెపరిన్ ను వాడునపుడు రక్త ప రీక్షలతో (Partial Thromboplastin Time)మోతాదును సరిదిద్దుతుండాలి. అల్ప అణుభారపు హెపరిన్ (LMWH)వాడేటపుడు రక్తపరీక్షలు, మోతాదు సవరణలు అవసరము ఉండవు. అస్థిరపు గుండెనొప్పి (unstable angina), NSTEMI (Non ST Elevation Myocardial Infarction) కలవారిలో ఔషధములతో చికిత్స చేస్తూ హృల్లేఖనములతో జాగ్రత్తగా వైద్యులు పర్యవేక్షిస్తుంటారు. ఔషధములతో గుండెనొప్పులు అదుపులోనికి వచ్చి ఇతర ఉపద్రవములు కలుగనపుడు, హృదయసూచకములు (cardiac markers) ట్రొపోనిన్ (troponin), క్రియటినిన్ కైనేజ్ (creatinine kinase) సాధారణ పరిమితులలో ఉన్నపుడు కూడా వారికి గుండెపోటులకు కాని ఆకస్మిక మరణములకు కాని అవకాశములు ఉంటే హృద్ధమనుల చిత్రీకరణము చేసి అవసరమయితే, ధమనుల వ్యాకోచము (angioplasty), వ్యాకోచ సాధనములతో (Coronary stents) చికిత్సలకు పూనుకోవాలి.       

అంతిమదశ దీర్ఘకాల మూత్రాంగ వైఫల్యము, కాలేయ వైఫల్యము, అంతిమదశలో ఉన్న ఊపిరితిత్తుల వ్యాధులు, చికిత్సలకు అవకాశములేని వ్యాప్తిచెందిన కర్కటవ్రణములు (metastatic cancers) వంటి వ్యాధులు వలన ఆయుఃప్రమాణము పరిమితమయిన వారికి ఔషధ చికిత్సలనే కొనసాగించుట మేలు. గుండెనొప్పులు అదుపులో ఉండకపోయినా, వాటి తీవ్రత హెచ్చినా, రక్తపీడనము బాగా తగ్గి శరీర రక్తప్రసరణకు భంగము చేకూరినా, ప్రమాదకర హృదయలయలు కలిగినా, కొత్తగా Left bundle branch block ఏర్పడినా, కొత్తగా ద్విపత్రకవాటములో తిరోగమన రక్తప్రసరణ (mitral regurgitation) కలిగినా, వారికి సత్వరముగ చర్మము ద్వారా హృద్ధమనుల చిత్రీకరణతో బాటు  రక్తప్రసరణ పునరుద్ధరణ ప్రయత్నములను చెయ్యాలి. ఏంజియోటెన్సిన్ కన్వర్ట ింగ్ ఎంజై మ్ ఇన్హి బిటర్లు (ACE Inhibitors) :

గుండెనొప్పి, గుండెపోటులు కలిగిన వారిలో ఏస్ అవరోధకములు

107 ::