పుట:Hello Doctor Final Book.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

tion) కలిగిన వారికి నాలుక క్రింద నైట్రోగ్లిసరిన్ ను అందించాలి. గుండె క్రిందిభాగము, కుడి జఠరిక (right ventricle) గుండెపోటుకు లోనయినప్పుడు, రక్తపీడనము తక్కువగా ఉన్నపుడు నైట్రోగ్లిసరిన్ వాడకూడదు. వీరిలో రక్తపీడనము బాగా తగ్గిపోయే అవకాశము ఉన్నది. రక్తపీడనము తక్కువగా లేనప్పుడు గుండెనొప్పి కొనసాగుతున్నపుడు నైట్రోగ్లిసరిన్ ను సిరల ద్వారా బొట్లుబొట్లుగా ఇస్తారు. నైట్రేటుల వలన ప్రసరణరహిత మరణము పొందు భాగము (infarct size) తగ్గుతుంది. గుండెవ్యాపారము మెరుగవుతుంది. బీటా గ్రాహక అవరోధకములు ( beta receptor blockers ) :  

బీటా గ్రాహక అవరోధకములను అస్థిరపు గుండెనొప్పి, గుండెపోటు ఉన్నవారికి వాడుతారు. ఇవి గుండె వేగమును తగ్గించి గుండెకు ప్రాణవాయువు అవసరమును తగ్గిస్తాయి. ఇవి రక్తపీడనము తగ్గించి గుండెకు శ్రమను తగ్గిస్తాయి. వీటిని గుండెవేగము నిమిషమునకు 50 కంటె తక్కువ ఉన్నా, ముకుళిత రక్తపీడనము (systolic blood pressure) 90 మి.మీ. పాదరసము కంటె తక్కువగా ఉన్నా, హృదయవైఫల్యము ప్రస్ఫుటముగా ఉన్నా, కర్ణిక జఠరికల మధ్య విద్యుత్ ప్రేరణ ప్రసరణకు  2 వ డిగ్రీ అవరోధము ఉన్నా (2nd degree atrioventricular block) వాడకూడదు. కొకైను వాడకము వలన గుండెపోటు కలిగిన వారిలోను, హృద్ధమనుల దుస్సంకుచితము (spasm) వలన గుండెనొప్పి కలిగివారిలోను బీటాగ్రాహక అవరోధకములను వాడకూడదు. బీటాగ్రాహకములను వాడలేని పరిస్థితులలో గుండెనొప్పి కొనసాగుతున్నపుడు నైఫిడిపిన్ తక్క మిగిలిన కాల్సియమ్ ఛానెల్ బ్లాకర్లను వాడవచ్చును. హెపరిన్ ( Heparin ) :

అస్థిరపు గుండెనొప్పి (unstable  angina), NSTEMI (Non ST Elevation Myocardial Infarction) కలవారిలో అవిభాగ హెపరిన్ (unfractionated heparin) కాని, అల్ప అణుభారపు హెపరిన్ (Low Molecular Weight Heparin) కాని వాడుతారు. స్థూలకాయుల లోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను అల్ప అణుభారపు హెపరిన్

106 ::