పుట:Hello Doctor Final Book.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చికిత్స :

ఛాతినొప్పి కలిగిన రోగులకు త్వరితముగా పరీక్షలు చేస్తూనే, చికిత్స కూడా సత్వరముగ అందించాలి. అస్థిరపు గుండెనొప్పి (unstable angina), లేక గుండెపోటు (myocardial infarction) లక్షణములు కలవారికి, ప్రాణవాయువు (Oxygen) నాసికా నాళముల ద్వారా అందించాలి. మార్ఫిన్ సల్ఫేట్ ( Morphine sulfate ) నొప్పిని నివారించుటకు తఱచు వాడుతారు. ఇది నొప్పిని నివారించుటే కాక ఆందోళనను తగ్గించి సహవేదన నాడీమండల తీవ్రతను తగ్గి స ్త ుం ది. వేగస్ నాడి (vagus nerve) ద్వారా గుండెవేగమును తగ్గిస్తుంది. సిరలను వ్యాకోచింపజేసి హృదయముపై కార్యభారము (pre systolic load)తగ్గించి హృదయమునకు ప్రాణవాయువు అవసరాలను తగ్గిస్తుంది. ఏస్పిరిన్ ( aspirin )

ఏస్పిరిన్ సూక్ష్మరక్తఫలకముల (platelets) గుమికూడుటను నివారిస్తుంది. 325 మి.గ్రా ఏస్పిరిన్ ను నమిలిస్తే అది త్వరితముగా పనిచేస్తుంది. థీనోపై రిడిన్లు ( Thienopyridines )

క్లొపిడోగ్రెల్ (clopidogrel), ప్రాసుగ్రెల్ (prasugrel) ఈ వరము ్గ నకు చెందిన ఔషధములు. ఇవి రక్తఫలకములపై ఉన్న ఎడినొసైన్ డైఫాస్ఫేట్ గ్రాహకములను (adenosine di phosphate receptors) నిరోధించి రక్తఫలకములు గుమిని అరికడుతాయి. రక్తస్రావ ప్రమాదము లేనివారిలో ఏస్పిరిన్ తో బాటు క్లొపిడోగ్రెల్ కాని, ప్రాసుగ్రెల్ కాని వాడుతారు. శస్త్రచికిత్సతో రక్తప్రసరణను పునరుద్ధరించవలసి వస్తే  రక్తస్రావము అధికము కాకుండుటకై క్లొపిడోగ్రెల్ ను శస్త్రచికిత్సకు ఐదు దినములకు ముందు, ప్రాసుగ్రెల్ ను ఏడు దినములకు ముందు ఆపివేయాలి. నై ట్రోగ్లి సరిన్

గుండెనొప్పి (angina), గుండెపోటు (Myocardial Infarc:: 105 ::