పుట:Hello Doctor Final Book.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(Echocardiograms) రక్తప్రసరణ లోపించిన హృదయ భాగములో హృదయ కుడ్యపు చలనములో మందకొడితనము చూపిస్తాయి. హృదయకుడ్య చలనములో లోపములు లేనివారిలో గుండెపోటు కలుగలేదని నిర్ధారించజాలము కాని, తీవ్రమైన నష్ట ము కలుగలేదని చెప్పగలము. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు ఛాతినొప్పిని కలిగించు ఇతర కారణములు, హృదయ కండరములో తాపమును (myocarditis), బృహద్ధమని కవాట సంకీర్ణతను (Aortic stenosis), బృహద్ధమని విదళనమును (Aortic dissection) పసిగట్టగలవు. గుండెపోటు వలన కలిగే ద్విపత్రకవాటములో తిరోగమన ప్రసరణ (mitral regurgitation), జఠరికాంతర కుడ్యములో రంధ్రములు (Ventricular septal defects) వంటి ఉపద్రవములు కూడా  ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము వలన తెలుస్తాయి. హృద్ధ మనుల చిత్రీకరణ ( Coronary angiography ) :

ఊరుధమని (femoral artery) లేక ముంజేతి వెలుపలి ధమని (Radial artery) ద్వారా బృహద్ధమనిలోనికి ఆపై హృద్ధమనుల లోనికి కృత్రిమనాళమును చొప్పించి ఎక్స్-రే వ్యత్యాస పదారము ్థ లతో హృద్ధమనుల చిత్రీకరణము (Coronary angiography) చేసి హృద్ధమనుల నిర్మాణమును, ఆ ధమనులలో సంకుచితములను, అవరోధములను కనుగొనవచ్చును. ధమనుల సంకుచితములను వ్యాకోచింపజేసి (angioplasty) అచట వ్యాకోచ సాధనములను (stents) అమర్చుట వంటి ప్రక్రియలు కూడా అవసరమయితే చేయగలరు. STEMI (ST Elevation Myocardial Infarction) ఉన్నవారిలోను, కొత్తగా Left bundle branch block కనిపించిన వారిలోను, గుండె వెనుకభాగములో గుండెపోటు కలిగిన వారిలోను, NSTEMI (Non ST Elevation Myocardial Infarction), అస్థిరపు గుండెనొప్పి (unstable angina) ఉన్నవారిలో ప్రాణాపాయ లక్షణములు ఉన్నపుడు, ఔషధములతో గుండెనొప్పులను అరిక ట్టలేకపోయినపుడు, రక్తప్రసరణను పునరుద్ధరించు ధ్యేయముతో హృద్ధమనీ చిత్రీకరణములు చేస్తారు.

104 ::