పుట:Hello Doctor Final Book.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలిగినవారిలో విద్యుత్ హృల్లేఖనములో కనీసము రెండు సమీప స్థానములలో  ST భాగము మూలరేఖకు కనీసము  1 మి.మీ పైకి ఎత్తుగా ఉంటుంది. కొందఱిలో కొత్తగా Left bundle branch block ( వీరిలో ఎడమ జఠరిక కండరజాలమునకు విద్యుత్ ప్రేరణ ఆలస్యముగా చేరుతుంది) కనిపిస్తుంది. గుండె వెనుకభాగము రక్తప్రసరణ లోపమునకు గుఱి అయినపుడు ST భాగము మూలరేఖకు దిగువకు పోయి V1, V2, V3 స్థానములలో R waves  పొడవుగా ఉంటాయి. అస్థిరపు గుండెనొప్పి (unstable angina), NSTEMI (Non ST Elevation Myocardial Infarction) గుండెపోటులు కలిగినపుడు విద్యుత్ హృల్లేఖనములలో ST భాగము మూలరేఖకు దిగువన ఉండవచ్చు, లేక ఏ మార్పులు ఉండవు. హృదయ సూచకములు ( Cardiac markers ) :

హృదయకండర కణములకు రక్తప్రసరణ ఎక్కువ సమయము లోపించినపుడు ఆ కణ పటలముల (cell membranes) అభేద్యత దెబ్బతిని ఆ కణముల నుంచి క్రియటినిన్ కైనేజ్ (Creatinine kinase), మయోగ్లోబిన్ (myoglobin), ట్రొపోనిన్ (Cardiac troponin) అనే హృదయ సూచకములు (Cardiac markers) బయటకు చింది రక్తములో కనిపిస్తాయి. ఛాతినొప్పి కలిగినవారిలో ఈ సూచకములకు వెంటనేను, 6 గంటలు, 12 గంటల తరువాతను పరిశోధించాలి. విద్యుత్ హృల్లేఖనములలో ST భాగము ఎత్తుగా ఉన్నవారిలో ఈ హృదయ సూచకములు (Cardiac markers) పెరుగకపోయినా, వారికి అతిత్వరగా రక్తప్రసరణను పునరుద్ధించు (revascularisation) ప్రయత్నములు చేయాలి. ST భాగము మూలరేఖకు ఎత్తులో లేక, హృదయసూచకములు మాత్రము పెరిగినవారిలో NSTEMI (Non-ST Elevation Myocardial Infarction) కలిగినట్లు నిర్ణయించాలి. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణము ( Echocardiogram ) :

ఛాతినొప్పి కొనసాగుతున్న వారిలో ప్రతిధ్వని హృదయ చిత్రీ కరణములు ఉపయోగపడుతాయి. ప్రతిధ్వని హృదయ చిత్రీకరణములు

103 ::