పుట:Hello Doctor Final Book.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రక్తపరిమాణములు కూడా తగ్గుతాయి. అందువలన రక్తపీడనము తగ్గగలదు. ఎడమ జఠరిక వైఫల్యము వలన ఊపిరితిత్తులలో ద్రవసాంద్రత (congestion) పెరిగి వైద్యులు ఊపిరితిత్తుల దిగువ భాగములలో చిటపట శబ్దములు వినగలుగుతారు.

గుండెపోటు వలన ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య ఉండు ద్విపత్రకవాటములో తిరోగమన రక్తప్రసరణము (Mitral Regurgitation) కలిగినా, రెండు జఠరికల నడిమిగోడలో రంధ్రము (Ventricular Septal Defect) ఏర్పడినా జఠరికలు ముకుళించుకున్నపుడు మర్మర శబ్దములు వినిపిస్తాయి.

ఛాతినొప్పిని కలిగించు ఇతర కారణములకు కూడా వైద్యులు పరిశోధించాలి. బృహద్ధ మ ని విదళనము (dissecting aortic aneurysm) అరుదైనా దీనివలన ఛాతినొప్పి కలుగుతుంది. ఈ నొప్పి చాలా తీవ్రముగా ఉంటుంది. ఛాతినొప్పితో బాటు నాడీమండలములో లోపములు, అవలక్షణములు కూడా వీరిలో కనిపించవచ్చు. హృదయవేష్టనములో తాపము (pericarditis) వలన ఛాతినొప్పి కలుగవచ్చును. వీరిలో హృదయవేష్టనపు పొరల రాపిడిశబ్దము (pericardial rub) వైద్యులు వినే అవకాశము ఉన్నది. పరీక్షలు :

ఛాతినొప్పి కలవారికి రక్తకణముల గణనము, రక్తరసాయన పరీక్షలు, రక్తములో కొవ్వుల పరీక్షలు అవసరము. విద్యుత్ హృల్లే ఖనము ( Electrocardiogram ) :

ఛాతినొప్పి కలిగిన వారికి హృదయ విద్యుల్లేఖనము వెంటనే తీయాలి. విద్యుత్ హృల్లేఖనములో మార్పులు వెనువెంటనే కనిపించక పోవచ్చును. అందువలన ప్రతి 20 నిముషములకు ఒకసారి చొప్పున రెండు గంటలు విద్యుత్ హృల్లేఖనములు తీసి మార్పులకై శోధించాలి. STEMI (ST Elevation Myocardial Infarction) గుండెపోటు

102 ::