పుట:Hello Doctor Final Book.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెమటలు, ఊపిరి అందకపోవుట (shortness of breath), వాంతిభావన (nausea), వాంతులు కూడా కలుగవచ్చును. కొందఱిలో ఛాతినొప్పి కాక అసాధారణమైన గుండెకు సంబంధించని లక్షణములు కలుగవచ్చును. ఊపిరి అందకపోవుట, పై కడుపులో నొప్పి, వికారము, కళ్ళుమసకబారి స్మృతితప్పుట (syncope), నీరసము వంటి అసాధారణ లక్షణములే సుమారు 25 శాతము మందిలో కలుగుతాయి.   స్త్రీలలోను, మధుమేహ వ్యాధిగ్రస్థులలోను, వృద్ధులలోను, మూత్రాంగ వైఫల్యము అంత్యదశలలో ఉన్నవారిలోను, శస్త్రచికిత్సలు సమీపకాలములో జరిగిన వారిలోను  అసాధారణ లక్షణములు ఎక్కువగా కనిపిస్తాయి. వీరిలో ఛాతిలో నలత ఉండవచ్చు. ఛాతినొప్పి తీవ్రముగా ఉండుట, ఎక్కువ సమయము ఉండుట, కొత్తగా కలుగుట అస్థిరపు గుండెనొప్పిని (Unstable Angina) సూచిస్తాయి. ఊపిరితో కలిగే నొప్పి, భుజముల చలనముతో కలిగే నొప్పి, ఛాతిపైన, పక్కటెముకలు (ribs) - ఛాతిఎముక సంధానముల ఒద్ద నొక్కుతే కలిగేనొప్పి గుండెనొప్పిని సూచించవు. కొద్ది సెకండులు మాత్రమే ఉండే నొప్పులు గుండెపోటును సూచించవు. వైద్యులు పరీక్షలో రక్తపీడనపు తగ్గుదల, వినికిడి గొట్టముతో విన్నపుడు గుండెలో క్రొత్త మర్మర ధ్వనులు, ఊపిరితిత్తుల క్రింది భాగములలో చిటపట శబ్దములు ఉన్నాయేమో పరిశీలిస్తారు.

హృదయవైఫల్య లక్షణములకు కూడా పరిశోధించాలి. హృదయ కండరమునకు (myocardium) రక్తప్రసరణ తగ్గినపుడు ఎడమ జఠరిక సంకోచము తగ్గి బృహద్ధ మ ని లోనికి నెట్ట బ డే రక్త ప రిమాణము తగ్గి రక్తపీడనము తగ్గగలదు. హృదయ సామర్థ్యము తగ్గుటచే రక్తపీడనము తగ్గి శరీర కణజాలమునకు రక్తప్రసరణ తగ్గుటను ‘హృదయ జనిత ఘాతము / హృదయ జనిత ఉపద్రవము (Cardiogenic shock) గా వ్యవహరిస్తారు. కుడి జఠరిక కండర జాలమునకు రక్తప్రసరణ తగ్గి కుడిజఠరిక (right ventricle) సమర్థత తగ్గుతే, పుపుసధమనికి (pulmonary artery) చేరే రక్త ప రిమాణము తగ్గి > ఎడమ కర్ణికకు పుపుససిరలు కొనిపోయే రక్త ప రిమాణము > ఎడమ జఠరికకు > బృహద్ధ మ నికి (aorta) చేరే

101 ::