పుట:Hello Doctor Final Book.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొందఱిలో ఈ నొప్పితో హృదయ విద్యుల్లేఖనములో (electrocardiogram) ST భాగము మూలరేఖ (baseline) మీదకు లేవకపోయినా, రక్తములో ట్రొపోనిన్ (troponin), క్రియటినిన్ కైనేజ్ (Creatinine Kinase), వంటి హృదయ సూచకములు (Cardiac markers) పెరుగుతే దానిని NSTEMI గా (Non ST Elevation Myocardial Infarction) వర్ణిస్తారు. వీరికి చికిత్స అస్థిరపు గుండెనొప్పి (unstable angina) కలిగిన వారి చికిత్స పంథాలోనే  అందిస్తారు.

ఆ రక్త పు గడ ్డ లు హృదయధమనులలో రక్త ప్ర సరణకు పూర్తిగా అడ్డుపడితే ప్రాణవాయువు, పోషక పదార్థ ము లు అందక ఆ యా ధమనులనుంచి ప్రసరణ పొందే హృదయ కండర కణజాలములో కొంతభాగము ప్రసరణరహిత మరణము (infarction) పొందుతుంది. అపుడు గుండెపోటు కలుగుతుంది. గుండెపోటు కలిగి హృదయకండర కణజాలము మృతి పొంది, హృదయ విద్యుల్లేఖనములో ST భాగము మూలరేఖపైకి ఎత్తుగా లేచి ఉన్నపుడు దానిని STEMI గా (ST Elevation Myocardial Infarction) వర్ణిస్తారు. STEMI చికిత్సలో రక్త ప్ర సరణను అతిత్వరగా పునరుద్ధ రిం చి హృదయ కండర కణజాల మరణమును (Myocardial Infarction) తగ్గించు ప్రయత్నములు చేయాలి. కొందఱిలో హృద్ధమని కండర దుస్సంకోచము (spasm), వలన, కొకైన్ దుర్వినియోగము కలిగించే హృద్ధ మ ని కండర దుస్సంకోచము వలన, పాండురోగము (anemia) వలన, గళగ్రంథి ఆధిక్యత (Hypothyroidism) వలన, రక్తపు ప్రాణవాయువు సంతృప్తత (Oxygen saturation) తగ్గుట వలన, రక్తపీడనము హెచ్చుట వలన సత్వర హృద్ధమని వ్యాధులు కలుగవచ్చును. సత్వర హృద్ధ మని వ్యాధి లక్షణములు  :

సాధారణముగా గుండెనొప్పి, గుండెపోటు కలిగినవారిలో రొమ్ముటెముక వెనుక భాగములో తీక్ష్ణమైన నొప్పి కలుగుతుంది. ఈ నొప్పి భుజములకు, భుజదండములకు, మెడకు, క్రింది దవడకు వ్యాపించవచ్చు. నొప్పితో బాటు

100 ::