పుట:Haravilasamu-Vavilla-1966.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

11

ఇంతియకాక యీతని తాత కమలనాభుఁడు పద్మపురాణము దెలిఁగించె ననుటవలన నీతనివంశ మాంధ్రవంశ మనియు, నితని దేశభాష లాంధ్ర దేశభాష లనియును దృఢపడుచున్నవి. తద్‌జ్ఞులు ప్రమాణము. శ్రీనాథుఁ డాంధ్రకర్ణాటులలో నెవ్వండైనను గవితామాధురికి లోపము గల్గదు గదా!

శ్రీనాథుఁడు పాకనాటి నియోగిబ్రాహ్మణుఁడు, భారద్వాజసగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు, కమలనాభుని పౌత్రుఁడు, మారనకు భీమనకుఁ బుత్రుఁడు. ఈ విషయము హరవిలాసము పీఠికలోని "కమలనాభునిపౌత్రు" అను 8 - వ పద్యమువలన స్పష్టము.

ఇక్కవి సార్వభౌమునివలననే కొండవీటిరెడ్లు, రాజమహేంద్రవరపురెడ్లు వన్నె కెక్కిరి. ఈ కవీంద్రుఁడు జీవించి యుండుకాలముంగుఱించి విచారణీయాంశము లనేకము లున్నను విస్తరభీతిచే సంగ్రహముగ వివరించెద.

శ్రీనాథుఁడు క్రీ. శ. 1397 సం. మొ. 1412 సం. వఱకు రాజ్యముచేసిన ఫిరోజిషాకాలమునను, 1382 సం. మొ. 1399 సం. వఱకు రాజ్య మొనర్చిన కుమారగిరి వసంతభూపాలు కాలమునను, 1379 సం. మొ. 1401 సం. వఱకు కర్ణాటసింహాసనాధిష్ఠితుఁ డైన హరిహరరాయల కాలమునను, 1422 సం. మొ. 1435 సం. వఱకు కల్బరిగి రాజ్యమును బాలించిన యహమ్మదుషా కాలమునను, అల్లాడభూపతి పుత్రులును, 1426 సం. మొ. 1450 సం. వఱకు రాజ్యము బాలించిన వేమారెడ్డి వీరభద్రారెడ్లకాలమునను నున్న ట్లీకవి గ్రంథములవలనఁ దెలియుచున్నది. ఈవీరభద్రారెడ్డియు వేమారెడ్డియు మరణించిన పిదపఁ