పుట:Haravilasamu-Vavilla-1966.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

పీఠిక

గొంతకాలమునకుఁ గృష్ణాతీరములోని బొడ్డుపల్లె యను నొక గ్రామమును గుత్తచేసి నదీప్రవాహమునఁ బైరు గొట్టుకొనిపోఁగా, రాజునకు గుత్తధనముఁ జెల్లింపలేక వారిచేఁ బలుబాధల నొంది యవసానకాలమున మిక్కిలి బీదతన మనుభవించె నని, మెకన్జీదొర యుదాహరించిన స్థానికచరిత్రలోని శ్రీనాథ కృతము లగు నీరెండు పద్యములవలనఁ దెల్లమగుచున్నది.


సీ. "కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెను గదా
             పురవీథి నెదురెండ బొగడదండ
     సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెను గదా
             నగరివాకిట నుండు నల్లగుండు
     ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మమ్మునఁ దగిలి
             యుండెను గదా నిగళయుగము
     వీరభద్రారెడ్డివిద్వాంసుముం జేత
             వియ్యమందెను గదా వెదురుగొడియ

తే. కృష్ణవేణమ్మ కొనిపోయె నింతఫలము
    బిల బిలాక్షులు దినిపోయెఁ దిలలు పెసలు
    బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి
    నెట్లు చెల్లింతుఁ డంకంబు లేడు నూర్లు.

సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి
            రత్నాంబరంబు లేరాయఁ డిచ్చుఁ
    గైలాసగిరిఁ బండె మైలారువిభుఁ డేఁగి
            దిన వెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
    రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు
            కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు