పుట:Haravilasamu-Vavilla-1966.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

9

దయలేదా? నేను డిండిమభట్టారకు నోడించిన శ్రీనాథుఁడ" నని తన్నెఱుకపఱచుకొని యుండవచ్చు ననియు,

"కాల్పట్టణాధీశ్వరున్" అనుచో నా కాల్పట్టణము కర్ణాటరాజ్యములోనిదై నట్లు నిదర్శనములు లేనందున నాయుక్తి విశ్వాసపాత్రము గా దనియు, నిట్లు పై కారణముల ఖండించి శ్రీనాథుఁడు పాకనాఁడు జన్మస్థానముగాఁ గల యాంధ్రుఁ డనియుఁ జెప్పఁబడి యున్నది.

ఈయుభయవాద హేతువులందును బలవత్తర మగు విని గమనము కనఁబడక పోయినను మఱికొన్ని కారణములవలనను, జనశ్రుతివలనను నాంధ్రచరిత్రకారుల యభిప్రాయమే సమంజస మని తోఁచుచున్నది.

ఇద్దాని కుపబలముగా శ్రీనాథుని బంధువు లందఱు నాంధ్రదేశములోని యాంధ్రులుగనే యున్నారు కాని, కర్ణాటకుఁ డొక్కరుఁడైన నున్నట్లు తెలియఁబడదు.

నాచికేతోపాఖ్యానమును రచించి యుదయగిరిదుర్గాధీశుఁడగు చిట్టి గంగామాత్యునకుఁ గృతియిచ్చిన దగ్గుపల్లి దుగ్గయామాత్యుఁడు శ్రీనాథునిభార్యకుఁ దోఁబుట్టువు. శ్రీనాథునకు శిష్యుఁడు. ఈగ్రంథమును ఓరియంటల్ లైబ్రరిలో నేఁ జదివి యున్నాఁడను. ప్రౌఢముగా రసవంతముగానే యున్నది.

రాజమహేంద్రవరాధిపతి యగు వీరభద్రభూపాలుని మంత్రి బెండపూడి యన్నామాత్యుఁడు -


"వినిపించినాఁడవు వేమభూపాలున, కఖిలపురాణవిద్యాగమముల
      ........ ......... ............ .......... ...........