పుట:Haindava-Swarajyamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

హైందవ స్వరాజ్యము

శముల దీర్చికొనిరి కాన మనమును అట్లు చేయుట న్యాయ మనువాదమును మొదట నాలోచింతము. వారు పశుబల ప్రయోగముచేసి యుండుట నిశ్చయము. మనమును అట్టి సాధనమునే వినియోగింపనగుననుటయు సంభావ్యమే. కాని మనకు అట్టి సాధనముచే అట్టిఫలమే సిద్ధించుననుట ! స్పష్టము. అట్టి ఫలము మనకు వలదని మీరంగీకరింతురుగదా! సాధనమునకు ఫలమునకు సంబంధములేదను మీయభిప్రాయము తప్పు. ఆతప్పుచేయుటచే దేశాభిమానులైన మహాపురుషులుకూడ మహానర్థములను లోకమున కల్పించినారు. విషబీజము నాటి సుందరమగు గులాబిపుష్పమును సృష్టింతుమని మీరు ప్రారంభించినారు. సముద్రముదాటుటకు నావయే యవసరము. బండి మీద ప్రయాణమైతిమా మనతోకూడ బండియు మునుగును. 'యథా రాజా తథా ప్రజా!' అనునది మననముచేయదగినది.దీని యర్థమెరుంగకమానవుడుపలుపాట్లపడినాడు. సాధనముబీజము, ఆదర్శము వృక్షము. బీజమునకు వృక్షమునకుగల అవార్యసంబంధమే సాధనమునకు ఆదర్శమునకు గలదు. దైవభక్తివలన కలుగుఫలము శనిభక్తివలన నెప్పుడును కలుగదు. కాబట్టి ఎవ్వరైనను నేను దైవమునారాధింపవలెను. కాని శనినారాధించి దైవము నారాధించినట్లనుకొందును' అందు రేని ఆది అజ్ఞానమని యందరును పరిహసింతురు. ఏవిత్తనమున కాఫలము