పుట:Haindava-Swarajyamu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము.

91

మీరు వాదించుట నాకు జ్ఞాపకమున్నది కాని అది నావాదమును విఘాతము చేయజాలదు. వారికి వ్యర్థపదార్థములపై ఆశయుండినది. వానిని గడించినారు. వారి ఆశాపూర్తియై నదనుటయే నాకవసరము. వారేమియుపాయములు వినియోగించిన నేమిపోయె? మన యాదర్శము ఉత్తమము ? దానిని చేరుటకు ఏయుపాయములైనను మనము ఉపయోగింపవచ్చును పశుబలముకూడ వినియోగార్హ మే. ఇంటిలో దొంగ దూరినప్పుడు వానిని తరుముటకు సాధనము లాలోచించుచు కూర్చొను వెర్రివారుందురా ? ఎట్లైనను అతనిని వెడలగొట్టుట కార్యము. మనవులు పెట్టుకొనుటచేత మన కేమియు ఫలము కలుగ లేదనియు కలుగపోదనియు మీ రంగీకరించుట స్పష్టము. అప్పుడు పశుబల ముపయోగించి యేల ఫలమందరాదు, సంపాదించినది నిలుపుకొనుటకుకూడ అవసరమైనంతవరకు ఆ సాధనమునే ప్రయోగార్హముగా పెట్టుకొందము. శిశువు అగ్నిలో కాలుపెట్టకుండ నిరంతరము నిర్బంధించుట సరియందురా కాదా ? ఎట్లైనను మనయుద్దేశముల సాధించుట యుత్తమము.

సంపా: మీవాదము పై చూపునకు బాగుగదోచును. ఇది యనేకుల నిదివరలో మోసపుచ్చినది. అయిన నేనితరులకంటె బాగుగా నెరుంగుదురు. కావున మీమోహమును తీర్చుటకు ప్రయత్నింతును. ఇంగ్లీషువారు పశుబలముమూలకముగా నుద్దే