పుట:Haindava-Swarajyamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశుబలము.

93

తప్పదు. ఇంగ్లీషువారు పశుబలము ప్రయోగించి 1833లో ఎక్కువ నిర్వచనాధికారము సంపాదించిరి. పశుబలప్రయోగముచే వారిధర్మము వారి కెక్కువయర్థమయ్యెనా ! నిర్వచనాధికారముకోరిరి. పశుబలప్రయోగము చేసిరి. అధికారమలవడెను.అయిన నిశ్చయస్వాతంత్య్రము ధర్మనిర్వహణము వలనకానిరాదు: ఆ స్వాతంత్ర్యమింకను వారికి కలుగ లేదు. కాబట్టి ఇంగ్లండున ఇప్పుడొకనాటక మేర్పడియున్నది. ప్రతివాడును స్వాతంత్య్రములు కోరువాడే. తనధర్మము నెఱింగినవాడు మాత్రమరుదు. ప్రతివాడు స్వాతంత్య్రములు కోరువాడైనప్పుడు ఎవ్వడు ఎవ్వరికి ఇయ్యగలడు? ఇంగ్లీషువారుధర్మము నిర్వహించుటే లేదని కాదు నామతము. వారుకోరు స్వాతంత్య్రముల కనుగుణమగు ధర్మనిర్వహణముమాత్రము మృగ్యము. అది లేక పోవుటచేత, అర్హతగడింపకపోవుట చేత, వారుగడించినస్వాతంత్ర్యములు వారికి మోయరానిభారమగుచున్నవి. అనగా వారు వినియోగించిన సాధనమునకుపూర్ణముగా ననుగుణమగుఫలము వారికి కలిగినది. ఫలమున కనుగుణమగుసాధనము వారు వినియోగించిరి. మీగడియారము నే నపహరింపవలెననినయెడల నేనుమీతోపోరవలెను, కొనవలెననిన మీకు ద్రవ్యమీయ వలెను, దానమడుగవలెనన్న మిముప్రార్థింపవలెను. ఈ యుపాయములలో నేనుపయోగించునుపాయము ననుసరించి ఆగడి