పుట:Haindava-Swarajyamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

దేశీయ మహాసభ : తదధికారులు,


షించుట వ్రీడాకరము. అతడు చేసినపని స్మరించుకొనుము. తన జీవితమునే అతడు దేశమునకై సమర్పించినాడు. మన కిప్పుడుకల జ్ఞానము అతడు పెట్టినభిక్ష. అంగ్లేయులు మన సార మును పీల్చి మనలను పిప్పి చేసిరనుట మనకు దెల్పిన వాడు దాదాభాయియే : కడపటివరకును ఆంగ్లజాతియందు అతనికి నమ్మకమున్నంతమాత్రమున నదియొక దోషమా? మనకు కండ కావరముండి ముందు కొకయడు గెక్కువగా పెట్టగల్గినంత నే దాదాభాయి గౌరవమునకు హానిగల్గునా ? ఆమాత్రము చేత మన మతనికంటెను వివేకులమా? వివేకు లైన వారి కొక టే గుర్తు. వారెక్కి వచ్చిన నిచ్చెనను వారెప్పుడును పడదన్ను కొనరు. మెట్లలో నొక మెట్టు నశించినను మెట్లన్నియు వీడిప డును. శిశువులుగా నుండి పెద్దయయినపిదప మనము శిశుస్థితిని తృణీకరింపము. నాటి సంగతి సందర్భములు స్మరించుకొని ఆనం దించుచుందుము. బహుకాలము నేర్చుకొని గురువు మనకు పాఠములు చెప్పును. దానిపై మనము మరికొంతదూరము మభివృద్ధి చేసికొందుము. ఆయన వేసిన పునాదుల పైన నేను కొంత యెక్కువ కట్టుకొనిననూత్రాన నేను ఎక్కున వివేకి యగుదునా ? అత డెప్పుడును నాకు గౌరవనీయు డేకదా ! మన భారతపి తామహుడగు దాదాభాయి సంగతియు నింతే. అతడు భారత జాతీయ నిర్మాత యని యంగీకరింపక తప్పదు.