పుట:Haindava-Swarajyamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
4

హైందవ స్వరాజ్యము.


మాట్లాడినయెడల సంతోషము. తక్కిన " శిష్ట ” సంభాష ణయంతయు నా నెత్తి కెక్కదు,

సుపా: ఈతొందరపాటు వలదు. నేనును మీరీతినుండ రాదు. కొంచెము ఓపిక పట్టితి రేని మీకు కావలసినదే నేనును చెప్పుట మీరెరుఁగ గలరు. చెట్టొక్క నాట పెరుగదు. నన్ను మీరు అభ్యంతర పెట్టుట, హైందవ భూమి మిత్రులను గురించి మీరు విననొల్ల కుండుట, చూడగా (మాసంగతి తీసికొను నెడల) స్వరాజ్యము కడుంగడుదూరమగునట్లు తోచుచున్నది. మీ వంటివార నేకులుండిన యెడల మన మొక అడుగైన ముందుకు పెట్టియుండము. ఈసంగతిమాత్రము జ్ఞాపకము పెట్టుకొనుడు.


చదువరి: మీ ధోరణి చూడగా లోకాభిరామాయణము మాట్లాడి నాకు జవాబు ఎగగొట్టు నట్లున్నది. నాకు ఎవరు దేశమిత్రులుగా దోచుచున్నారో వారు నా అభిప్రాయము ప్రకా రము దేశమిత్రులు గారు. అట్లుండగా వారిని గురించిన ఈ ప్రసంగము నేను వినవలసినపని యేమి ? మనజాతికంతయు పితామహుడని మీ రనునట్టి యతఁడు ఆజూతి కేమిచేసినాడు ? అతఁడు చెప్పునదంతయు ఇది : "ఇంగ్లీషు పరిపాలకులు న్యాయ ముచేయుదురు. వారికి సహాయముకండు”.


సంపా : తిన్నగా చెప్పినను దృఢముగా చెప్పుచున్నాను. అంతటిమహానుభావునిగురించి నీవింత అవకతవకగా సంభా