పుట:Haindava-Swarajyamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
6

హైందవ స్వరాజ్యము.

చదువు : మీరు చక్కగా చెప్పితిరి. దాదాభాయి గౌరవ నీయుడని నాకిప్పుడు అర్థమయినది. ఆతడును మరియాతనివంటి వారును లేనియెడల మన కీనాడుగల యుత్సాహము కలిగి యుండక పోవచ్చును. అయిన గోకెలేనుగురించి ఇట్లు చెప్పను రాదు. ఆతఁడు ఇంగ్లీషు వారికి గొప్ప స్నేహితుఁడు. స్వరాజ్య మునుగురించి మాట్లాడుటకు ముందు మనము వారి దగ్గర నుండి ఎంతో నేర్చుకొనవలెననియు వారి రాజకీయ వివేకమును సంపా దింపవలెననియు అతడు చెప్పును. అతని యుపన్యాసములు చదిని చదివి నాకు వెగటుపుట్టినది.


సంపా : అట్లు వెగటు పుట్టిన యెడల అది మీయసహనము నకే ద్యోతకముగా నున్నది. తల్లిదండ్రులు మెత్తగా నాలోచన చేయుదు రనియు వారు తమతో పరుగెత్తిరనియు కోపించు కొనుబిడ్డలు తల్లిదండ్రుల నగౌరవపరచువా రనికదా మనము నమ్మచున్నాము. గోకెలేపండితుడు పితృవర్గము లోనివాడు. అతఁడు మనతో పరుగు లెత్త లేదని మన మేవగించుకొననగునా? స్వరాజ్యమును కోరునట్టిజాతి పితృవర్గము నెప్పుడును నుల్లం ఘింపతగదు. పూర్వికులయెడ మర్యాద లేనినాడు మనము వ్యర్థు లముగాని మరి వేరుగాము.ఆతురతపాలుగలవారు ఆత్మ సామ్రాజ్య మేలజాలరు. భావపరిపాకముగలవారల కే అయ్యది తగును. మరియొక మాట. గోకె లేమహాశయుడు తన సర్వస్వమును మన