పుట:Haindava-Swarajyamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76

హైందన స్వరాజ్యము.


సౌఖ్యమునకును ఆరోగ్యమునకును కారణభూతము కాని మరి యొకటి కాదనుటను వారు గ్రహించిరి. ఇంతే కాదు. గొప్ప గొప్పనగరముల నిర్మాణముకూడ వ్యర్థమనియు దోషాకరమ నియు వారు కని పెట్టిరి. అట మానవుడు సుఖపడజాలడు. దొం గలు, దోపిడీకాండ్రు ఎక్కువగ నుందురు. దుష్ట వృత్తులు మెం డగును, భాగ్యవంతులు బీదలను దోచికొందురు. కాబట్టి మన పూర్వికులు చిన్న గ్రామములను నిర్మించుకొనుటతో సంతృప్తి పొంది యుండిరి. రాజుల కత్తులు నీతికత్తికి లోకువయనుట వారి నమ్మిక. కాబట్టి ఋషులు, పరులయెదుట సార్వభౌములు తక్కువయని సిద్ధాంతీకరించిరి. ఇట్టి యమోఘసిద్ధాంతముల కాకరమయిన జూతి ఇతరులకు గురు పదమున నుండదగినదే కాని ఇతరుల నుండి నేర్చుకొనదగినది కాదు. మనజూతి వారుకూడ న్యా యస్థానములు, న్యాయవాదులు, వైద్యులు అనుసంస్థలను ఎరుం గుదురు. కాని వీని కెప్పుడును. మితియేర్పడియుండును; ఈవృత్తు లెంతో గౌరవాస్పదములు కావనుటను ప్రతివాడును అంగీక రించుచుండెను. అంతేకాక వకీళ్లు, వైద్యులు ప్రజలను దోచు కొనుచుండ లేదు. వారు ప్రజల నౌకరులుగా నెంచబడుచుండిరి గాని యజమానులుగా నెంచబడుచుండ లేదు. న్యాయవిచారణ సాధారణముగా సరిగా నుండినది, న్యాయస్థానములకు పోకుండుట నాటి సామాన్య సూత్రము. మానవులను అందులోనికి ప్రవేశ